Government Employees: నిర్ణీత వయసు దాటిన తర్వాత నుంచి పెన్షనర్లకు అడిషనల్ పెన్షన్ లభిస్తుంది. అయితే ఈ వయోపరిమితిని తగ్గించాలని చాలాకాలం నుంచి డిమాండ్స్ జరుగుతున్న సంగతి అందరికీ తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల భవిష్యత్తు మరియు వృద్ధాప్యంలో భద్రత కోసం పెన్షన్స్ స్కీమ్ లు అమలు చేస్తుంది. అయితే సంపాదన లేని సమయంలో ఆర్థిక అవసరాలను తీర్చేందుకు ఈ డబ్బులు ఉపయోగపడతాయి. ఈ పెన్షన్ అమౌంట్ అనేది ఫిక్స్డ్ గా ఉండదు. వయసుతోపాటు పెరుగుతున్న అవసరాలను కూడా తీర్చుకోవడానికి పెన్షన్ అమౌంట్ కూడా అదనంగా పెరుగుతుంది.
నిర్ణీత వయసు దాటిన తర్వాత నుంచి ఎడిషనల్ పెన్షన్ లభిస్తుంది. ఈ వయపరిమితిని తగ్గించడానికి చాలా కాలం నుంచి డిమాండ్లు జరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం పదవి విరమణ చేసిన వారికి అదనపు పెన్షన్ ప్రయోజనాలు అందించేందుకు కనీస వయసును తగ్గించే ప్రణాళికలు లేవని స్పష్టంగా తెలిపింది. అయితే కేంద్ర ప్రభుత్వం కనీస వయస్సును 65 సంవత్సరాలకు తగ్గించాలని అనుకుంటున్నప్పటికీ వయోపరిమితిని మాత్రం 80 సంవత్సరాలు గానే ఉంచనుంది.
ఇక పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ 2021లో పెన్షన్ల ఫిర్యాదులపై 65 సంవత్సరాల వయసులో అదనపు పెన్షన్ ప్రారంభించాలని సిఫార్సు చేసింది. 2022లో ప్రభుత్వం ఈ సూచనను సమీక్షించి నివేదికను కూడా సమర్పించడం జరిగింది. అయితే కేంద్ర ప్రభుత్వం ఈ మార్పును ఆమోదించకూడదని నిర్ణయం తీసుకుంది. లోక్సభలో కూడా వయోపరిమితికి సంబంధించి తగ్గించడం గురించి ప్రతిపాదన వచ్చినప్పటికీ దానిని కూడా తిరస్కరించారు. అయితే కేంద్ర ప్రభుత్వం ఆరవ వేతన సంఘం ఆధారంగా 80 ఏళ్లకు 20 శాతం ఎక్కువ పెన్షన్ వస్తుంది. అలాగే 85 ఏళ్లకు 30%, 90 ఏళ్లకు, 95 ఏళ్లకు 50% ఇక 100 సంవత్సరాల వయసులో 100% ఎక్కువ టెన్షన్ అందుతుంది. వృద్ధ పెన్షనర్లకు వయసుతోపాటు పెరుగుతున్న ఆరోగ్య సంబంధిత ఖర్చులకు ఎక్కువ సహకారం అవసరమని కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది.