Todays Horoscope: నేటి అదృష్ట రాశి ఫలాలు.. ఆర్ధిక పరిస్థితి బాగా పెరిగిన రాశులు..
నేడు మార్చి 27, 2025 నాటి రాశి ఫలాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మేష రాశి వారికి ఈరోజు ఆర్థికంగా బాగా అనుకూలంగా ఉంది. వృషభ రాశి వారికి ఉద్యోగంలో పదోన్నతి లభించే అవకాశం. మిథున రాశి వారికి వ్యాపారంలో లాభాలు బాగా పెరుగుతాయి. మేషరాశి నుంచి మీన రాశి వరకు ఈరోజు 12 రాశి ఫలాలు దిన ఫలాలు ఇవే.
మేషరాశి:
వీరికి ఆర్థికంగా బాగా అనుకూలమైన రోజు. ఆర్థికంగా ఎటువంటి ప్రయత్నాలు చేసినా కూడా ఫలితం సాధిస్తారు. వృత్తి మరియు ఉద్యోగపరంగా అనుకూలంగా ఉంది. వ్యాపారాల్లో లాభాలు పొందుతారు. అనవసర పరిచయాలకు దూరంగా ఉండాలి. స్నేహితుల మీద డబ్బు ఖర్చు చేసే అవకాశం ఉంది. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు.
వృషభ రాశి:
వృత్తి మరియు వ్యాపారంలో ఆశించిన స్థాయిలో పురోగతి ఉంటుంది. లాభాలు అందుతాయి. ఉద్యోగంలో పదోన్నతి లభిస్తుంది. మీ సమర్థతకు తగిన గుర్తింపు ఉంటుంది. ఆదాయం వృద్ధి చెందుతుంది. ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్త వహించాలి. విద్యార్థులకు ఈ సమయం చాలా అనుకూలంగా ఉంది. కుటుంబంలో అపార్ధాలు తలెత్తే అవకాశం ఉంది.
మిథున రాశి:
వృత్తి మరియు ఉద్యోగాలలో శుభపరిణామాలు చోటుచేసుకుంటాయి. వ్యాపారాల్లో లాభాలు బాగా పెరుగుతాయి. అనేక రకాలుగా ఆదాయం వృద్ధి చెందుతుంది. ఇతర ఆర్థిక లావాదేవీలు కూడా బాగా లాభాలను ఇస్తాయి. ఆస్తిపాస్తులు విలువ పెరిగే అవకాశం ఉంది. చిన్నపాటి ప్రయత్నం కూడా మంచి లాభాలను ఇస్తుంది. అనుకున్న పనులన్నీ పూర్తి చేస్తారు. ఆరోగ్యం కుదుటపడుతుంది. వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి.
కర్కాటక రాశి:
వృత్తి మరియు ఉద్యోగాల్లో పని ఒత్తిడి ఉంటుంది. వ్యాపారాల్లో లాభాలు పర్వాలేదు. నిరుద్యోగులు మంచి ఆఫర్లు పొందుతారు. పెళ్లి ప్రయత్నాలకు అనుకూలమైన సమయం.ప్రయాణ సమయంలో డబ్బులు లేదా విలువైన వస్తువులు పోగొట్టుకునే అవకాశం ఉంది. ఆర్థిక విషయాలలో సన్నిహితులతో జాగ్రత్తగా ఉండాలి. ఆదాయం వృద్ధి చెందుతుంది కానీ ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగం మారడానికి ఇది సరైన సమయం.
సింహరాశి:
ఇంటా మరియు బయట అనుకూలంగా ఉంది. ఇంట బయట మీ మాటకు విలువ ఉంటుంది. ఆదాయం వృద్ధి చెందుతుంది కానీ ఆర్థిక విషయాలలో ఎవరికి కూడా వాగ్దానాలు చేయకపోవడం ఉత్తమం. సొంత పనుల మీద శ్రద్ధ వహించాలి. డాక్టర్లు లాయర్లు మరియు ఇంజనీర్లకు అనుకూలమైన సమయం. నిరుద్యోగులు చిరుద్యోగంలో చేరే అవకాశం ఉంది. స్వల్ప అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది.
కన్యరాశి:
ఉద్యోగంలో అదనపు బాధ్యతలు పెరుగుతాయి. వృత్తి మరియు వ్యాపారాల్లో తీరిక ఉండదు. ఊహించిన విధంగానే ఆదాయం వృద్ధి చెందుతుంది. కుటుంబ ఖర్చులన్నీ అదుపు చేసుకుంటారు. ఆహార విహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయం ఏర్పడుతుంది. ఉద్యోగ మరియు పెళ్లి ప్రయత్నాలకు ఇది సరైన సమయం. ఆర్థికపరంగా ఎవరికి వాగ్దానాలు చేయకపోవడం మంచిది. కుటుంబ జీవితము ఆనందంగా సాగిపోతుంది.
తులారాశి:
ఉద్యోగ జీవితం ఉత్సాహంగా సాగుతుంది. వృత్తి జీవితంలో అనుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. వ్యాపారంలో బాగా కలిసి వస్తుంది. ఉద్యోగానికి సంబంధించి శుభవార్తలు వింటారు. మీరు అనుకున్న కోరిక నెరవేరుతుంది. మంచి పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంది. ఆదాయం పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాలలో మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంది.
వృశ్చిక రాశి:
ఉద్యోగ జీవితం సాఫీగా సాగుతుంది. అనుకున్న పనులన్నీ పూర్తి చేస్తారు. డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లు వంటి వారికి చాలా అనుకూలమైన సమయం. వ్యాపారాలు నిలకడగా ఉంటాయి. అదనపు ఆదాయ ప్రయత్నాలు కలుస్తాయి. ఆరోగ్యం నిలకడగా ఉంది. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందుతాయి. ఏ ప్రయత్నం చేసిన కూడా ఫలిస్తుంది.
ధనస్సు రాశి:
ఉద్యోగ జీవితం అనుకూలంగా ఉంది. వృత్తి మరియు ఉద్యోగాలలో రాబడి బాగుంటుంది. కుటుంబ జీవితం ఆనందంగా సాగిపోతుంది. పెళ్లి ప్రయత్నాలలో శుభవార్తలు వింటారు. ఆదాయం వృద్ధి చెందుతుంది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్త వహించాలి. తల్లిదండ్రులలో ఒకరి ఆరోగ్యం ఆందోళనకు గురిచేస్తుంది. స్నేహితుల సహాయంతో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు.
మకర రాశి:
ఆదాయం పెరుగుతుంది కానీ అనవసర ఖర్చులు పెరుగుతాయి. ఇంట మరియు బయట ఒత్తిడి పెరుగుతుంది. ఉద్యోగంలో ముఖ్యమైన బాధ్యతలు ఏర్పడతాయి. వృత్తి మరియు వ్యాపారాలు నిలకడగా ఉన్నాయి. మంచి పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంది. వ్యక్తిగత సమస్య పరిష్కారం అవుతుంది. పెద్దల సహకారంతో ఆస్తి వివాదం పరిష్కారం అవుతుంది. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఉద్యోగం లభిస్తుంది.
కుంభరాశి:
ఉద్యోగంలో శ్రమ ఎక్కువగా ఉంటుంది. అధికారుల నుంచి ఆశించిన ప్రతిఫలం మరియు ప్రోత్సాహకాలు లభిస్తాయి. వృత్తి మరియు వ్యాపారాలు నిలకడగా ఉంటాయి. ఆర్థిక పరిస్థితి కూడా నిలకడగా ఉంటుంది. పెళ్లి ప్రయత్నాలలో శుభవార్తలు వింటారు. సొంత ఇంటి ప్రయత్నాలలో పురోగతి సాధిస్తారు. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
మీనరాశి:
ఆరోగ్యం బాగా పెరుగుతుంది. అలాగే కుటుంబ ఖర్చులు కూడా పెరుగుతాయి. ఉద్యోగంలో ఒత్తిడి మరియు శ్రమ తప్పదు. బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి బాగా వృద్ధి చెందుతుంది కానీ ఆర్థిక వ్యవహారాలలో ఎవరికి వాగ్దానాలు చేయకపోవడం మంచిది. వ్యక్తిగత సమస్య పరిష్కారం అవుతుంది. ఉద్యోగ మరియు పెళ్లి ప్రయత్నాలలో శుభవార్తలు వింటారు.