Chanakya Niti: తన అపారమైన జ్ఞానాన్ని మరియు జీవితానభవాలను రంగరించి ఆచార్య చాణిక్యుడు ఒక గొప్ప గ్రంధాన్ని రచించాడు. ఆ గ్రంథం పేరు నీతి శాస్త్రం. మనిషి జీవితానికి సంబంధించిన అనేక రహస్యాల గురించి ఈ గ్రంథంలో ప్రస్తావించబడింది. మనిషి ప్రవర్తన అలాగే రాజకీయాలు, ఆర్థికం, నైతిక విలువలు ఇలా ప్రతి దాని గురించి కూడా నీతి శాస్త్రంలో ఆచార్య చాణిక్యుడు కొన్ని సూచనలు ఇచ్చారు. మానవుల మంచి లక్షణాల గురించే కాకుండా వాళ్లలో ఉన్న బలాలు, బలహీనతలు అలాగే లోపాల గురించి కూడా నీతి శాస్త్రంలో వివరించారు. మనిషి ఏ సమయంలో మాట్లాడాలి అలాగే ఎప్పుడూ మౌనంగా ఉండాలి అనే విషయాన్ని గురించి కూడా నీతి శాస్త్రంలో క్షుణ్ణంగా ఆచార్య చాణిక్యుడు తెలిపాడు.
ప్రతిచోట కూడా మాట్లాడకుండా నాలుకను అదుపులో ఉంచుకోవాలి అని ఆచార్య చాణిక్యుడు సూచించాడు. కొన్ని సందర్భాలలో మౌనంగా ఉండడం ఉత్తమమని ఆయన తెలిపారు. కొన్ని ప్రత్యేక పరిస్థితులలో మౌనంగా ఉండాలి. లేకపోతే దాని వలన మనం నష్టపోయే అవకాశం ఉంది. గొడవలు, కొట్లాటలు జరుగుతున్న చోట మౌనంగా ఉండడం మంచిది. కొంతమంది తమను అడగకపోయినాప్పటికీ వాళ్ళు మధ్యలో కలగజేసుకొని సలహాలు ఇస్తూ ఉంటారు. కాబట్టి అటువంటి చోట మాట్లాడకుండా మౌనం పాటించాలి.
కొంతమందికి తమను తాము పొగుడుకునే అలవాటు ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో కూడా మౌనంగా ఉండాలి. ఆ పరిస్థితులలో మీరు ఏదైనా మాట్లాడితే వాళ్లు మిమ్మల్ని అవమానించే అవకాశం ఉంటుంది. ఖాళీగా ఉన్నా కూడా నీళ్లు చిందుతుంది. ఒకవేళ ఆ కొండ నిండి ఉంటే నీళ్లను చిందదు. తక్కువ జ్ఞానం ఉన్న చాలా మంది ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. పూర్తి జ్ఞానం ఉన్నవారు మౌనంగా ఉంటారు. సగం సమాచారం ఉన్నా కూడా మౌనంగా ఉండడం ఉత్తమం అని ఆచార్య చాణిక్యుడు తెలిపాడు. మీకు ఇతరులు వారి సమస్యల గురించి చెబుతున్న సమయంలో శ్రద్ధగా విని వాళ్ళ బాధను అర్థం చేసుకోవాలి. అటువంటి పరిస్థితుల్లో కూడా మౌనంగా ఉండాలి. వీలైనంత వారికి సాయం చేయడానికి ప్రయత్నించాలి. అనవసరమైన మాటలు చెప్పి వాళ్లను మరింత ఇబ్బంది పెట్టకూడదు.