Todays Gold Rate: ఈరోజు బంగారం మరియు వెండి ధరలు స్వల్పంగా తగ్గినట్లు తెలుస్తున్నాయి. తులం బంగారం ధర ఇప్పుడు ఒక లక్షకి చేరువలో 97 వేల దగ్గర ఉంది. గత వారంలో బంగారం ధరలలో స్వల్ప హెచ్చుతగ్గులు కనిపించాయి. ప్రస్తుతం ఎటువంటి మార్పు లేకుండా బంగారం ధరలు స్వల్ప తేడాతో కొనసాగుతున్నాయి.
జూన్ 2, 2025 సోమవారం రోజు మన దేశ మార్కెట్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. స్వచ్ఛమైన బంగారం ఒక గ్రామ్ రూ9,730, 22 క్యారెట్ల బంగారం ఒక గ్రామ్ రూ.8,919 గా ఉంది. బంగారం కొనాలని ఎదురుచూస్తున్న వారు ఎప్పటికప్పుడు ధరలను పరిశీలిస్తూ ఉంటారు.
మన దేశంలో ఉన్న పలు ప్రధాన నగరాలలో నేడు బంగారం మరియు వెండి ధరలు ఇలా ఉన్నాయి.
ఢిల్లీ మార్కెట్లో నేడు 22 క్యారెట్ల తులం గోల్డ్ రేటు రూ.89,340, 24 క్యారెట్ల తులం గోల్డ్ రేటు రూ.97,450.
ముంబై, చెన్నై, బెంగళూరు మార్కెట్లలో ఈరోజు 22 క్యారెట్ల తులం గోల్డ్ రేటు రూ.89,190, 24 క్యారెట్ల తులం గోల్డ్ రేటు రూ.97,300 గా ఉన్నాయి.
ఇక తెలుగు రాష్ట్రాలలో పలు ప్రధాన నగరాలు అయినా హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్, విశాఖపట్నం, విజయవాడ నగరాలలో ఈరోజు 22 క్యారెట్ల తులం గోల్డ్ రేట్ రూ.89,190, 24 క్యారెట్ల తులం గోల్డ్ రేటు రూ.97,300 గా ఉన్నాయి.
ఇక మన దేశ మార్కెట్లో ఈరోజు కిలో వెండి ధర రూ.1,10,800 గా ఉంది.