Sub Registration: ఆర్మూర్, ఆగస్టు 14 (ప్రజా శంఖారావం): Sub Registration/నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ (ARMOOR) సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ సేవలకు అంతరాయం ఏర్పడినట్లు క్రయ విక్రయదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వచ్చిన ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. చుట్టుపక్కల లోని భీంగల్ (BHEEMGAL), నిజామాబాద్ (NIZAMABAD) ప్రాంతాలలో (AREAS) యధావిధిగా సబ్ రిజిస్ట్రేషన్ కార్యకలాపాలు కొనసాగగా, ఆర్మూర్ సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో మాత్రం రిజిస్ట్రేషన్ కు అంతరాయం (INTERRUPTION OF REGISTRATION) ఏర్పడడం పై క్రయ విక్రయదారులు మండిపడుతున్నారు.
Also Read: ప్రభుత్వ ఆసుపత్రిలోనే ప్రసవాలు
మిగతా చోట్ల రిజిస్ట్రేషన్ సేవలు కొనసాగగా ఆర్మూర్ లో మాత్రం ఎందుకు కొనసాగించడం లేదని ప్రజలు (PUBLIC) అసహనం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఇన్చార్జి సబ్ రిజిస్టర్ విక్రమ్ (VIKRAM) ను వివరణ కోరగా నెట్వర్క్ ఏరియా ప్రాంతాన్ని బట్టి ఆన్లైన్ సైట్ ఓపెన్ కాకుండా అంతరాయం ఏర్పడుతుందని ఆయన (ANSWER) బదులిచ్చారు. నెట్వర్క్ కారణాలతో ఉదయం (MORNING) నుండి రిజిస్ట్రేషన్ సైట్ ఓపెన్ అవ్వడం లేదని ఆయన చెప్పారు.
Also Read: రైతులకు గుడ్ న్యూస్.. సబ్సిడీ పై యంత్రాలు కావాలంటే .. 31 వరకు గడువు