Armoor: ప్రభుత్వ ఆసుపత్రిలోనే ప్రసవాలు

Armoor
Armoor

Armoor: ఆర్మూర్, మే 06 (ప్రజా శంఖారావం): ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో మంగళవారం డివిజన్ స్థాయి అధికారులతో నిజామాబాద్ జిల్లా డి ఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ రాజశ్రీ రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రిలోనే నార్మల్ డెలివరీ అయ్యేలా చూడాలని సిబ్బందికి సూచించారు. ఆస్పత్రులలో వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించాలని, ఆస్పత్రులకు వచ్చే గర్భిణీ స్త్రీలు, రోగులకు వైద్య సదుపాయాలు అందించి ఆరోగ్య మెలుకువల పట్ల జాగ్రత్తలు సూచించాలని చెప్పారు.

వేసవి కాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించాలని ఆమె అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులలో కుక్కకాటుకు సంబంధించిన వ్యాక్సిన్ ను అందుబాటులో ఉండేలా చూడాలని చెప్పారు. గ్రామాలలోని గర్భిణీ స్త్రీలకు సాధారణ ప్రసవాలను ప్రభుత్వ ఆసుపత్రిలోనే చేయించుకునే విధంగా అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా డిప్యూటీ డిఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ రమేష్, డి ఐ ఓ డాక్టర్ అశోక్, జిల్లా ఎపిడిమిలోజిస్ట్ డాక్టర్ వెంకటేష్, ఆర్మూర్ డివిజన్ వైద్యాధికారులు, వైద్య సిబ్బంది తదితులు పాల్గొన్నారు.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now