Yellareddy: ఎల్లారెడ్డి, మే 31 (ప్రజా శంఖారావం): శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే ఉపేక్షించేది లేదని ఎల్లారెడ్డి డిఎస్పి అన్నారు. వివరాలలోకి వెళితే ఎల్లారెడ్డి మండల కేంద్రంలోని ముత్యపు రాఘవులు ఫంక్షన్ హాల్ లో డీఎస్పీ శ్రీనివాస్ రావు ఆధ్వర్యంలో శాంతియుత సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డి.ఎస్.పి మాట్లాడుతూ మండలంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని మతాల పెద్దలు పోలీసువారికి సహకరించాలని కోరారు. సోషల్ మీడియాలో మత కలహాలను సృష్టించే విధంగా, విషపూరిత పుకార్లను నమ్మవద్దని కోరారు.
నిజ నిజాలు తెలియకుండా మీకు వచ్చిన అసత్యపు సోషల్ మీడియా సందేశాలను దాని గురించి నిజామా అబద్దమా అని ఆలోచించకుండా ఇతరులకు షేర్ చేయకుడదన్నారు. దాని వలన ఎలాంటి ప్రమాదమైన జరగవచ్చు కావున ప్రశాంత మైన వాతావరణంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని మతాల వారు అన్ని వర్గాల వారు పోలీసులకి సహకరించాలని అన్నారు. ప్రజా భద్రత, లా అండ్ ఆర్డర్ సమస్యలు తలెత్తకుండా ప్రజలు శాంతి యుత జీవనం గడిపేలా చూడడం పోలీసుల ప్రధాన లక్ష్యం అన్నారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలు, ప్రజా శాంతి కి భంగం కలిగించే వారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదన్నారు. ఎల్లారెడ్డి ప్రజలు అన్నదమ్ముల వలే కలిసి ఉండి ఎలాంటి సంఘటనలకు తావు లేకుండా అందరికి, అన్ని ప్రాంతాల వారికీ ఆదర్శంగా నిలివాలని కోరారు. ఈ కార్యక్రమంలో సి.ఐ ఎల్లారెడ్డి బి.రవీందర్ నాయక్, ఎస్.ఐ మహేష్, పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.