Todays Gold Rate: మహిళలకు గుడ్ న్యూస్.. తగ్గిన పసిడి, వెండి ధరలు..

Todays Gold Rate
Todays Gold Rate

Todays Gold Rate: మహిళలకు గుడ్ న్యూస్.. తగ్గిన పసిడి, వెండి ధరలు..

మన దేశ ప్రజలు బంగారాన్ని ఒక స్టేటస్ సింబల్ గా భావించడంతోపాటు ఎప్పుడైనా ఆర్థిక ఇబ్బందులు కలిగినప్పుడు దానిని ఒక ఆర్థిక భరోసాగా కూడా భావిస్తారు. ఈ క్రమంలోనే ఏ పండుగలు, పెళ్లిళ్లు, శుభకార్యాలు ఏం జరిగినా కూడా బంగారం కొనడానికి ఆసక్తి చూపిస్తారు. ఈ మధ్యకాలంలో బంగారం మరియు వెండి పై పెట్టుబడులను పెట్టడానికి చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు. అయితే బంగారం ధరలు గత కొన్ని రోజుల క్రితం ఆల్టైమ్ హై రికార్డ్ కి చేరుకున్న సంగతి అందరికీ తెలిసిందే. అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాల ప్రకారం కూడా బంగారం ధరలలో మార్పులు జరుగుతూ ఉంటాయి. ఈరోజు అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ బలపడడంతో బంగారం ధర స్వల్పంగా తగ్గినట్లు కనిపిస్తుంది. మే 15, గురువారం బంగారం ధరలు ఈ విధంగా ఉన్నాయి. హైదరాబాద్ నగరంలో గురువారం రోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 88,040, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.96,050. ఇక తెలుగు రాష్ట్రాలలోనే ఇతర ప్రధాన ప్రాంతాలు అయిన రాజమండ్రి, విశాఖపట్నం, విజయవాడ, పొద్దుటూరు మరియు వరంగల్ జిల్లాలలో కూడా దాదాపు ఇవే ధరలు ఉన్నాయి.

దేశ రాజధాని అయిన ఢిల్లీ నగరంలో ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 88,040, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.96,200.

ఆర్థిక రాజధాని అయిన ముంబై నగరంలో ఈరోజు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రేటు రూ.88,040, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రేటు రూ.96,050. ఇక దేశంలో ఇతర ప్రధాన నగరాలు అయిన కేరళ, కోల్కత్తా, బెంగళూరు మరియు పూణే వంటి నగరాలలో కూడా దాదాపు ఇవే ధరలు ఉన్నాయి. ఈరోజు బంగారంతో పాటు వెండి ధర కూడా కొంచెం తగ్గినట్లు తెలుస్తుంది. మనదేశంలో బంగారం తర్వాత మహిళలు ఎక్కువగా కొనే లోహం వెండి. వెండికి కూడా మన దేశ మార్కెట్లో చాలా మంచి డిమాండ్ ఉంది. ఇంట్లో ఎటువంటి శుభకార్యం జరిగిన కూడా వెండి వస్తువులను బహుమతిగా ఇస్తూ ఉంటారు. గతంలో కిలో వెండి ధర లక్ష రూపాయలు దాటిన సంగతి తెలిసిందే. ఈరోజు వెండి ధరలో కూడా స్వల్పంగా తగ్గుదల కనిపిస్తుంది. గురువారం రోజు కిలో వెండి ధర రూ.1,08,900. దేశంలో ఇతర ప్రధాన నగరాలు అయినా కేరళ, చెన్నైలో కూడా కిలో వెండి ధర ఈ విధంగానే ఉంది. దేశ రాజధాని అయిన ఢిల్లీలో ఈరోజు కిలో వెండి ధర రూ.97,800.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now