Chanakya Niti: ఆచార్య చాణిక్యుడు గురించి చాలామందికి తెలుసు. ఆయన గొప్ప పండితుడు మాత్రమే కాదు గొప్ప రాజకీయవేత్త అలాగే అపర మేధావి. తన నీతి శాస్త్రం ద్వారా ఆచార్య చాణిక్యుడు మనిషి జీవితానికి సంబంధించిన అనేక విషయాలను తెలిపాడు. ఆయన చెప్పిన విధానాలను ఇప్పటికి కూడా చాలామంది అనుసరించి జీవితంలో విజయం సాధించారు. ఈ కాలం వారికి కూడా నీతి శాస్త్రంలో ఆచార్య చాణిక్యుడు చెప్పిన విధానాలు స్ఫూర్తిదాయకంగా నిలిచాయి అని చెప్పడంలో సందేహం లేదు. చాణిక్యుడు నీతి శాస్త్రంలో భార్యాభర్తల బంధం గురించి మాత్రమే కాకుండా అమ్మాయిలు, బాలికలకు ఉపయోగపడే అనేక నియమాలను కూడా నీతి శాస్త్రంలో తెలియజేశాడు.
తమ వ్యక్తిత్వాన్ని బలోపేతం చేసుకుని సంతోషంగా జీవించాలి అంటే ప్రతి అమ్మాయి కూడా తప్పకుండా ఈ నియమాలు పాటించాలి అని ఆచార్య చాణుక్యుడు తెలిపాడు. ఆయన చెప్పిన దాని ప్రకారం ప్రతి అమ్మాయి కూడా తన ఆత్మ గౌరవం విషయంలో ఎప్పుడు కూడా రాజీ పడకూడదు. తన ఆత్మ గౌరవాన్ని ఎటువంటి పరిస్థితిలో అయినా ఇప్పుడు ఉన్నతంగా ఉంచుకోవాలి అని ఆచార్య చాణిక్యుడు తెలిపాడు.
ఇతరులతో స్నేహం చేసే విషయంలో కూడా అమ్మాయిలు చాలా ఆలోచించాలి. మంచి వ్యక్తులతో స్నేహం చేయడం తమను ఉన్నతంగా ఉంచుతుంది. అందుకనే ఆచార్య చానిక్యుడు సరైన వ్యక్తులతో స్నేహం చేయాలని అమ్మాయిలకు సూచిస్తున్నారు. విద్య అనేది అమ్మాయిలకు చాలా అవసరం. ఒక అమ్మాయి బాగా చదువుకుంటే తను సమాజాన్ని మార్చగలదు అంటూ ఆచార్య చాణక్యుడు తన నీతి శాస్త్రంలో తెలిపారు. అమ్మాయిలకు ఓర్పు అనేది తప్పనిసరిగా ఉండాలి. జీవితంలో అమ్మాయి విజయం సాధించాలి అంటే ఓర్పు మరియు సహనం చాలా ముఖ్యం. ఈ విధంగా ఆచార్య చాణక్యుడు తన నీతి శాస్త్రంలో అమ్మాయిల గురించి కొన్ని ముఖ్యమైన నియమాలను తెలియజేశారు.