Acharya Chanakya: ఆచార చాణిక్యుడు తన నీతి శాస్త్రంలో మనిషి జీవితానికి సంబంధించి చాలా విషయాల గురించి ప్రస్తావించాడు. చాలామంది ఆచార చాణిక్యుడు నీతి శాస్త్రాన్ని ఫాలో అవుతూ ఉంటారు. అయితే ఒక మనిషి జీవితంలో ఆనందంగా ఉండాలంటే కొన్ని నియమాలను తప్పకుండా పాటించాలి అని ఆచార్య చాణిక్యుడు తన నీతి శాస్త్రంలో తెలిపాడు. ఆచార్య చాణిక్యుడి గురించి చాలామందికి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. ఈయన చాలా గొప్ప పండితుడు, అపర మేధావి మరియు రాజకీయవేత్త. నీతి శాస్త్రంలో ఆచార్య చానిక్యుడు ఒక వ్యక్తి సంతోషంగా ఉండడానికి విజయవంతంగా తన జీవితాన్ని గడపడానికి కొన్ని నియమాలను ఆచరించాలని తెలిపాడు.
నీతి శాస్త్రంలో మనిషి జీవితానికి ఉపయోగపడే చాలా విషయాల గురించి వివరంగా తెలియజేశాడు. ఆచార్య చాణుక్యుడి నీతి శాస్త్రాన్ని పాటించిన వారు చాలామంది తమ జీవితంలో సక్సెస్ అయ్యారు. ఒక వ్యక్తి ఆనందంగా ఉండాలంటే మూడు నియమాలను కచ్చితంగా పాటించాలి అని ఆచార్య చాణిక్యుడు తెలిపాడు. మనం ఆనందంగా ఉన్న సమయంలో మనకు తెలియకుండానే ఇతరులకు కొన్ని వాగ్దానాలు చేస్తూ ఉంటాము.
అలా చేయకూడదట. కోపం అనే భావోద్వేగంలో ఉన్నప్పుడు మనం కొన్ని సందర్భాలలో స్పృహ కోల్పోతాం. బాగా కోపంగా ఉన్న సమయంలో సమాధానాలు చెప్పకూడదట. దీనివలన బంధం చెడిపోయే ప్రమాదం ఉంది. కొంతమంది విచారంగా ఉన్న సమయంలో కూడా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకొని చాలా నష్టపోతారు. కాబట్టి విచారంగా ఉన్న సమయంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదట. కొన్ని కొన్ని సార్లు అవి తప్పుగా మారే అవకాశం ఉంది. ఒక మనిషి ప్రతిరోజు ఆనందంగా, సంతోషంగా గడపాలంటే ఈ మూడు నియమాలను తప్పకుండా పాటించాలి అని ఆచార్య చాణిక్యుడు తన నీతి శాస్త్రంలో చెప్పడం జరిగింది.