Vehicle: మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని సాగర్ అనే పట్టణానికి చెందిన హిమన్షు పటేల్ అనే ఒక యువకుడు ఇటీవలే ఒక హైబ్రిడ్ వాహనాన్ని రూపొందించాడు. ఈ హైబ్రిడ్ వాహనం విద్యుత్ తో పాటు డీజిల్ తో కూడా నడవడం దీని ప్రత్యేకత అని తెలుస్తుంది. హిమాన్షు కేవలం రెండు లక్షల రూపాయల వ్యయంతో ఈ హైబ్రిడ్ వాహనాన్ని రూపొందించినట్లు తెలిపాడు. ప్రస్తుతం హిమాన్షు గుజరాత్ రాష్ట్రంలోని గాంధీనగర్ లో ఎలక్ట్రిక్ బ్రాంచ్ లో బిఈ చదువుతున్నాడు.
2020 సంవత్సరంలో కరోనా లాక్డౌన్ సమయంలో మధ్యప్రదేశ్ కు చెందిన హిమాన్షు సొంతంగా ఈ కారును కూడా తయారు చేశాడు. ఇక ఇటీవలే ఇతను హైబ్రిడ్ వాహనాన్ని తయారు చేసి ప్రతి ఒక్కరికి ఆశ్చర్యాన్ని కలిగించాడు. తను తయారు చేసిన హైబ్రిడ్ వాహనం లీటర్ డీజిల్ కు 19 లీటర్ల మైలేజీ ఇస్తుందని అలాగే గంటకు 120 కిలోమీటర్ల వేగంతో వెళ్తుందని తెలిపాడు. సాధారణంగా అయితే ఎలక్ట్రిక్ కార్లు అన్నీ కూడా ఆటోమేటిక్ మోడల్ లో పనిచేస్తాయి అన్న సంగతి తెలిసిందే. ఈ హైబ్రిడ్ వాహనం మాన్యువల్ తరహాలో గేర్ల సహాయంతో నడుస్తుందని హిమాన్షు వివరించాడు.