Toe Rings Tradition: భారతీయ మహిళలు పెళ్లి తర్వాత కాలికి మెట్టెలు ధరిస్తారు. స్త్రీ యొక్క వైవాహిక స్థితిని ఈ సంప్రదాయ ఆభరణం సూచిస్తుంది. హిందూమత సాంప్రదాయంలో మహిళలు కాలికి మెట్టెలను ఎక్కువగా ధరిస్తారు. పెళ్లి చేసుకున్న తర్వాత మహిళలు కాలికి మెట్టెలు అలాగే గాజులు ధరించడం అనేది భారతీయ సాంప్రదాయాలలో పురాతన సంప్రదాయం. కేవలం ఈ ఆభరణాలు అలంకారం కోసం మాత్రమే కాదు ఆరోగ్యం మరియు శక్తితో కూడా సంబంధం కలిగి ఉన్నాయని పెద్దలు చెప్తుంటారు. ప్రాచీనవైద్య పద్ధతుల ప్రకారం చూసుకున్నట్లయితే కాలి బొటనవేలు పక్కన ఉన్న వేలు విద్యుత్ వాహక శక్తిని కలిగి ఉంటుందట.
కాబట్టి ఈ వేలుకి మెట్టెను ధరించడం వలన శక్తి ప్రసరణను సులభతరం చేస్తుంది. ముంతేజీ నరాలకు, గర్భకోసానికి కూడా సంబంధం ఉంటుంది అని చెప్తారు. ఈ క్రమంలో గాజులు పునరుత్పత్తి శక్తిని పరీక్షిస్తాయని చాలామంది నమ్మకం. వైద్య, శక్తి మరియు సాంప్రదాయ కలయికను ఈ ఆభరణాలు సూచిస్తాయి అని నిపుణులు చెప్తున్నారు. కాలికి బొటనవేలు పక్కన ఉన్న వేలు గుండె ద్వారా వెళుతుందని అది గర్భాసయానికి సంబంధించినదని చాలామంది చెప్తారు. కాబట్టి ఆ వేలికి వెండి మెట్టెను ధరించడం వలన అది గర్భాశయ రక్తపోటును అదుపులో ఉంచడానికి చాలా సహాయపడుతుంది.
ఆ స్త్రీ యొక్క ఋతుచక్రం నియంత్రణలో కూడా ఇది సహాయ పడుతుందని నమ్ముతారు. ప్రాణ మార్గాలన్నీ కూడా ప్రాచీన భారతీయుల ప్రకారం కాళీ వేళ్ల గుండ వెళతాయని నమ్ముతారు. కాబట్టి ఇటువంటి వేళ్లకు వెండి మెట్టెలను ధరించడం వలన ప్రాణశక్తి సమతుల్యతను కాపాడడానికి ఉపయోగపడతాయి. శరీరానికి వెండి చాలా మంచిది. భూమి యొక్క ధ్రువ శక్తిని గ్రహించి దానిని శరీరానికి ప్రసారం చేసే సామర్థ్యం వెండి కి ఉంటుంది. కాబట్టి వెండి మెట్టలను కాలికి ధరించడం వలన స్త్రీలు సంభోగం సమయంలో అనుభవించే బాధ కూడా తగ్గుతుంది అని నమ్ముతారు.