మానవతా స్ఫూర్తి చాటుకున్న వినయ్ రెడ్డి

vinay reddy

ప్రజా శంఖారావం, వెబ్ డెస్క్: హైదరాబాదులోని మల్లారెడ్డి నారాయణ ఆసుపత్రిలో జక్రాన్ పల్లి మండల కేంద్రానికి చెందిన జగడం నారాయణ చికిత్స పొందుతూ అత్యవసర నిమిత్తం బి నెగిటివ్ రక్తం అవసరముందని సన్నిహితులు, ఆయన కుటుంబ సభ్యులు బి నెగిటివ్ రక్త దానం చేసే దాతలు ముందుకు రావాలని సామాజిక మాధ్యమంలో పోస్ట్ చేశారు.

ఈ పోస్టుకు స్పందించిన నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి మల్లారెడ్డి నారాయణ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న బాధితునికి బి నెగిటివ్ రక్తం దానం చేసి తన మానవతా స్ఫూర్తిని చాటుకున్నారు. ఆపదలో ఉన్నవారికి రక్తదానం చేయడంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ముందుండాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now