Kamareddy: కామారెడ్డి జిల్లా ప్రతినిధి, మార్చి 01(ప్రజా శంఖారావం):నిజాంసాగర్ చౌరస్తాలో నడి రోడ్డుపై భార్యను భర్త హత్య చేయడంతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. కామారెడ్డి పట్టణ కేంద్రంలోని ఆర్ బి నగర్ లో మహేశ్వరి, నర్సింలు నివాసిస్తున్నారు. నిజాంసాగర్ చౌరస్తాలో ఉన్న మరుగుదొడ్లలో పనిచేస్తున్న భర్త నరసింహులు భార్య మహేశ్వరి ల మధ్య తరచూ గొడవలు జరిగేవని స్థానికులు చెప్పారు. శనివారం భార్యతో భర్త నర్సింలు గొడవ పడుతున్న సమయంలో తన వద్ద ఉన్న చాకుతో భార్య గొంతు కోసి హత్య చేసి అనంతరం భర్త ఆత్మహత్యానికి పాల్పడ్డాడు. ఈ విషయం తెలుసుకున్న కామారెడ్డి అడిషనల్ ఎస్పీ చైతన్య రెడ్డి, స్థానిక సీఐ చంద్రశేఖర్ రెడ్డిలు ఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. కుటుంబ గొడవలతో ఈ ఘటన జరిగినట్లు ప్రాథమిక విచారణలో వెళ్లడైందని పోలీసులు చెప్పారు.
Kamareddy: నడిరోడ్డులో… భర్త చేతిలో భార్య హత్య
ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group
Join Now