Viral Video: భారతదేశంలో ప్రధాన నగరాలలో ట్రాఫిక్ కష్టాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రద్దీగా ఉన్న సమయంలో వెహికల్ తీసుకొని బయటకు వెళ్లాలంటే భయపడాల్సిన పరిస్థితి ఉంది. అలాగే రద్దీగా ఉండే రోడ్లమీద ప్రయాణం చేస్తున్నప్పుడు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వెహికల్ నడపాల్సి ఉంటుంది. ఎక్కడినుంచి ఏ వాహనం దూసుకొని వచ్చి ఢీ కొడుతుందో చూసుకుంటూ జాగ్రత్తగా బండి నడపాలి. ఇక బస్సులు లేదా లారీలు వంటి పెద్ద వాహనాల పక్క నుంచి వెళ్లేటప్పుడు మరింత జాగ్రత్త తీసుకోవాలి. పెద్ద వాహనానికి చిన్న వాహనం తాగినా లేదా చిన్న వాహనానికి పెద్ద వాహనం దాటినా కూడా డ్యామేజ్ అయ్యేది చిన్న వాహనమే. అలా వాహనాలు తాకినప్పుడు వాహనదారులు రోడ్లమీద గొడవలు కూడా పడుతుంటారు.
వాహనాలు ఒకదానికి ఒకటి తాకినప్పుడు ట్రాఫిక్ లో అడ్డంగా ఉన్న సమయంలో వివాదం ఏర్పడుతుంది. అటువంటి సమయంలో చాలామంది వాహనాల మీద నుంచి కిందకు దిగి రోడ్డు మీద గల్లాలు పట్టుకొని కొట్టుకున్న సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది. ఒక బైక్ చేసిన పనికి బస్సు డ్రైవర్ తీవ్ర ఆగ్రహం చెందిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ డ్రైవర్ చేసిన పనికి అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు.
ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఒక బైకరు ఆగి ఉన్న బస్సు తలుపు తీసి డ్రైవర్తో గొడవ పెట్టుకున్నాడు. ఇద్దరు కూడా మాట మాట అనుకున్నారు. ఆ బైకరు డ్రైవర్ చేయి పట్టుకొని దాడి చేయబోయాడు. ఆ సమయంలో బస్సు డ్రైవరు తన చేతిని లాక్కొని సీటు నుంచి పైకి లేచాడు. సీటు వెనకాల తగిలించి ఉన్న తన బ్యాగ్ మరియు బైక్ హెల్మెట్ తీసుకుని బస్సు నుంచి కిందకు దిగాడు.ఆ తర్వాత అతను బస్సును రోడ్డుపై వదిలేసి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఈ ఘటనతో అక్కడున్న వాళ్లంతా ఒకసారిగా షాక్ అయ్యారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్త ప్రస్తుతం వైరల్ అవుతుంది.
Life is too short to do Kalesh, Just Pack your bag and Move on pic.twitter.com/cvkubSDbDy
— Ghar Ke Kalesh (@gharkekalesh) March 18, 2025