Home బిజినెస్ Inter Answer Sheets Evaluation 2025: ప్రారంభమైన ఇంటర్ జవాబు పత్రాల కరెక్షన్స్ .. ఫలితాలు...

Inter Answer Sheets Evaluation 2025: ప్రారంభమైన ఇంటర్ జవాబు పత్రాల కరెక్షన్స్ .. ఫలితాలు ఎప్పుడో తెలుసా!

Inter Answer Sheets Evaluation 2025
Inter Answer Sheets Evaluation 2025

Inter Answer Sheets Evaluation 2025:  ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం మరియు రెండవ సంవత్సరం వార్షిక పరీక్షలు మార్చి 20 గురువారంతో ముగిసాయి. ఇంటర్ జవాబు పత్రాల మూల్యాంకనం ప్రక్రియ కూడా ప్రారంభమైనట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. 16 రోజుల పాటు కొనసాగిన ఇంటర్మీడియట్ పరీక్షలు అయిపోవడంతో విద్యార్థులు ఇంటి బాట పట్టారు. ఈ క్రమంలో ఎక్కడ చూసినా బస్టాండ్లో మరియు రైల్వే స్టేషన్స్ విద్యార్థులతో కిక్కిరిసాయి. ఒక ఏడాది పాటు అధ్యాపకులు చెప్పే పాఠాలను శ్రద్దగా విని పుస్తకాలతో కూస్తిపట్టిన విద్యార్థులు ప్రస్తుతం వార్షిక పరీక్షలు ముగియడంతో కేరింతలు కొడుతూ రోడ్లమీద సందడి చేశారు.

చివరి పరీక్ష రాసి పరీక్ష కేంద్రాల నుంచి బయటకు వచ్చిన విద్యార్థులు తమ స్నేహితులతో ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటూ సందడి చేశారు. ఈనెల మార్చి ఐదున ప్రారంభమైన ఇంటర్ పరీక్షలు మార్చి 20వ తేదీతో ముగిశాయి. అక్కడక్కడ కొన్ని చోట్ల విద్యార్థులు కాపీయింగ్ కు ప్రయత్నించడంతో అధికారులు వాళ్లను డిబార్ చేశారు. దాదాపు అన్ని పరీక్ష కేంద్రాలలో కూడా పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని చెప్పొచ్చు. అయితే బుధవారం నుంచే ఇంటర్ జవాబు పత్రాల మూల్యాంకనం ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటర్ బోర్డు మూల్యాంకన కేంద్రాల్లో తొలిసారిగా ఆధార్ బేస్డ్ బయోమెట్రిక్ హాజరైన అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది.

రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 19 సెంటర్లలో ఇంటర్ జవాబు పత్రాల మూల్యాంకనాన్ని నిర్వహిస్తున్నారు. ఇంటర్ జవాబు పత్రాల మూల్యాంకనం మార్చి 19 నుంచి ఏప్రిల్ 10వ తేదీ వరకు కొనసాగుతుంది. ఈ మూల్యాంకన విధుల్లో ప్రతి సెంటర్లో 600 నుంచి 1200 మంది వరకు సిబ్బంది పాల్గొన్నారు. ఇంటర్ బోర్డు బి ఐ ఈ యాప్ ను కూడా అందుబాటులోకి తెచ్చింది. వేలిముద్రలు లేదా ఫేషియల్ రికగ్నిషన్ ద్వారా ఈ యాప్ లో హాజరు చేసుకోవచ్చు. ఇంటర్ జవాబు పత్రాల మూల్యాంకనం పూర్తయిన తర్వాత మరో 10 రోజుల్లో మార్కులను ఎంటర్ చేసే ప్రక్రియను కూడా పూర్తి చేస్తారు ఆ తర్వాత వెంటనే ఫలితాలను ప్రకటిస్తారు. ఈ విధంగా చూసుకుంటే ఏప్రిల్ మూడో వారంలో ఫలితాలు వెలువడే అవకాశం ఉందని ఇంటర్ బోర్డు అధికారులు తెలిపారు.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now