Suvidha Loan: మన దేశ ప్రభుత్వానికి చెందిన జాతీయ షెడ్యూల్డ్ కాస్ట్ ఫైనాన్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అందిస్తున్న సువిధ లోన్ పథకం అనేది ఒక ఆత్మ నిర్భర్ స్వయం ఉపాధి ప్రోత్సాహక పథకం. తమ సొంత వ్యాపారాలను ప్రారంభించడానికి లేదా అభివృద్ధి పరచడానికి షెడ్యూల్డ్ క్యాస్ట్ వర్గానికి చెందినవారు ఈ పథకం కింద ఆర్థిక సహాయం పొందవచ్చు. విలువైన ప్రాజెక్టుపై ఈ పథకం కింద షెడ్యూల్డ్ క్యాస్ట్ వారికి పది లక్షల రూపాయల వరకు రుణం ఇస్తారు. సువిధ పథకం కింద మీ ప్రాజెక్టు ఖర్చు లో 90 శాతం అంటే 9 లక్షల వరకు మీరు మీ వ్యాపార అవసరాల కోసం ఆర్థిక సహాయం పొందవచ్చు.
కేవలం మీకు ఎనిమిది శాతం వడ్డీ రేటుకి ఏ రుణాన్ని అందిస్తున్నారు. అలాగే గరిష్టంగా ఐదు సంవత్సరాల కాలంలో ఈ రుణాన్ని మీరు తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. సువిధ లోన్ పథకం కుటుంబ వార్షిక ఆదాయం మూడు లక్షల కంటే తక్కువగా ఉన్నవారికి మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి ఉంటుంది. ఈ పథకం కింద వ్యక్తులు లేదా భాగస్వామి సంస్థలు, సహకార సంఘాలు కూడా రుణం తీసుకోవచ్చు.
అయితే ఈ పథకం కింద లోన్ తీసుకోవాలి అని భావిస్తున్న భాగస్వామ్య సంస్థలు లేదా సహకార సంఘాల సభ్యులందరూ కూడా ముఖ్యంగా ఎస్సీ వర్గానికి చెందినవారు మాత్రమే అయి ఉండాలి. ఈ పథకం కింద లోన్ తీసుకోవాలి అనుకుంటున్నారు తామ ప్రారంభించబోతున్న వ్యాపారానికి సంబంధించిన ప్రాజెక్టు రిపోర్ట్ తో పాటు తమ ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఇన్కమ్ సర్టిఫికెట్, క్యాస్ట్ సర్టిఫికెట్, బ్యాంకు స్టేట్మెంట్ అందించాల్సి ఉంటుంది. ఈ పథకానికి సంబంధించిన దరఖాస్తులను తమ జిల్లా స్థాయి రాష్ట్ర చానలైజింగ్ ఏజెన్సీల కార్యాలయాల్లో స్వీకరిస్తున్నారు.NSFDC కి ఎంపిక చేసిన ప్రాజెక్టులను పంపిన తర్వాత మీకు రుణం ఆమోదం అందుతుంది.