Todays Gold Rate: మళ్లీ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు భగ్గుమంటున్నాయి. ఈరోజు తులం బంగారంపై ఏకంగా రూ.500 పెరిగినట్లు సమాచారం. ఈరోజు హైదరాబాద్ మార్కెట్లో స్వచ్ఛమైన బంగారం ధర ఒక గ్రామ్ కు రూ.9,808, ఒక గ్రామ్ 22 క్యారెట్ల బంగారం ధర రూ.8,990 గా ఉంది. అంతర్జాతీయంగా రూపాయి మారకం విలువ డాలర్ తో ప్రభావితం అవడం అలాగే అంతర్జాతీయంగా జరుగుతున్న ఒడిదుడుకులు కారణంగా బంగారం ధరలలో మార్పులు జరుగుతున్నాయి.
హైదరాబాద్ మార్కెట్లో నేడు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరపై 500 రూపాయలు పెరిగినట్లు తెలుస్తుంది. దీంతో ప్రస్తుతం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.89,900 గా ఉంది. అలాగే 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధరపై 550 రూపాయలు పెరిగింది. దీంతో స్వచ్ఛమైన 10 గ్రాముల బంగారం ధర రూ.98,080 గా ఉంది. ఇక విజయవాడ మరియు విశాఖపట్నం మార్కెట్లో కూడా ఈరోజు ఇవే ధరలు ఉన్నట్లు సమాచారం.
మన దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్లో ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.90,050, 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.98,230 గా ఉన్నాయి. బంగారం ధరలు పరుగులు పెడుతున్న క్రమంలో వెండి ధరలు మాత్రం స్వల్పంగా తగ్గుతున్నాయి. ఈరోజు కిలో వెండి పై బులియన్ మార్కెట్లో ₹100 తగ్గినట్లు తెలుస్తుంది. ఇక హైదరాబాద్ మార్కెట్లో నేడు కిలో వెండి ధర రూ.1,10,900 గా ఉంది.ఇక దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్లో ఈరోజు కిలో వెండి ధర రూ.99,900 గా ఉంది.