Todays Gold Rate: పసిడి ప్రియులకు దిమ్మతిరిగే షాక్.. లక్షకు చేరుకున్న తులం బంగారం ధర…తెలుగు రాష్ట్రాలలో తులం ఎంత అంటే

Todays Gold Rate
Todays Gold Rate

Todays Gold Rate: రష్యా ఉక్రెయిన్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం మళ్లీ కొత్త మలుపు తిరిగినట్లు తెలుస్తుంది. ఈ క్రమంలో రెండు దేశాల మధ్య పరిస్థితి మరింత దిగజారుతుందని సమాచారం. ప్రపంచ స్థాయిలో ప్రస్తుతం పెరుగుతున్న ఉద్రిక్తత కారణంగా దీని ప్రభావం అంతర్జాతీయ మార్కెట్లో పడుతుంది. సాంప్రదాయ సురక్షిత పెట్టుబడుల వైపు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలో పసిడి ధరలు భారీగా పెరుగుతున్నాయి. పెట్టుబడిదారులకు పసిడి ఇష్టమైన పెట్టు కదా మారింది. ఈరోజు వెండి ధరలు కూడా పెరిగినట్లు తెలుస్తోంది.

నిన్నటితో పోలిస్తే స్వచ్ఛమైన తులం బంగారం పై ఈరోజు 400 రూపాయలు పెరిగింది. ఈరోజు మన దేశం మార్కెట్లో స్వచ్ఛమైన 10 గ్రాముల గోల్డ్ ధర రూ.99,610 గా ఉంది.మనదేశంలో తులం బంగారం ధర కొన్ని ప్రాంతాలలో లక్ష రూపాయల వరకు కూడా చేరుకుంది. ఇప్పుడు మార్కెట్లో తులం బంగారాన్ని కొనుగోలు చేయాలంటే జిఎస్టి మరియు ఇతర చార్జీలతో కలిపి లక్ష రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఇక మన దేశ మార్కెట్లో ఈరోజు 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.91,130 గా ఉంది. కిలో వెండి ధరపై కూడా భారీగానే పెరిగింది. కిలో వెండి ధర నిన్న ఒక్కరోజు 3000 రూపాయలు పెరిగింది. ఈరోజు మన దేశ మార్కెట్లో కిలో వెండి ధర రూ.1,14,100 గా ఉంది.

దేశంలో పలు ప్రధాన నగరాలు చెన్నై, ముంబై, హైదరాబాద్ మార్కెట్లో ఈరోజు స్వచ్ఛమైన తులం బంగారం ధర రూ.99,610 గా ఉంది. 22 క్యారెట్ల తులం బంగారం ధర ఈరోజు రూ.91,310 గా ఉంది. అయితే ప్రస్తుతం పెట్టుబడిదారులకు చాలా గొప్ప ఎంపీగా మారిన బంగారం ధరలు భవిష్యత్తులో బలహీనంగా ఉండబోతున్నాయి అని నిపుణులు అంచనా వేస్తున్నారు. రానున్న రెండు నెలలలో బంగారం ధరలు కుప్పకూలిపోతాయని భావిస్తున్నారు.

ఆర్థికవేత్తలు బంగారం ధరలు 12 నుంచి 15% తగ్గుతాయని చెప్తున్నారు. మనదేశంలో మార్నింగ్ స్టార్ విశ్లేషకుడు మిల్స్ అంచనా వేసిన దాని ప్రకారం తులం బంగారం ధర రూపీస్ 56వేలకు పడిపోతుంది. దీనికి ప్రధాన కారణం సరఫరా అధికంగా ఉండడం అని చెప్పొచ్చు. ఏదైనా ఒక వస్తువు సరఫరా మార్కెట్లో బాగా పెరిగినప్పుడు దాని ధర క్రమంగా పడిపోతుంది. బంగారానికి కూడా ఇవే నియమాలు వర్తిస్తాయి.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now