Alove vera Health Tips: కలబంద తో ఎన్ని లాభాలో తెలుసా..?
కలబంద మొక్కను ఇంటి దిష్టి కోసం వాడుతారు. మరికొందరు చర్మ సౌందర్యానికి ఉపయోగిస్తారు. ఇంటి ఆవరణలో మొక్కగా పెంచుకుంటారు. కానీ కలబంద జ్యుస్ తాగితే శరీరానికి ఎంత మేలు చేస్తుందో చాలా మందికి తెలియదు. కలబంద వలన కలిగే లాభాల గురించి ఆరోగ్య నిపుణులు ఈ విదంగా చెబుతున్నారు.
ఒక గ్లాస్ నీటికి సరిపడేంత కలబంద గుజ్జును కలుపుకొని తాగితే శరీరానికి అనేక విధాలుగా మేలు జరుగుతుంది. బీపీ, షుగర్ ఉన్నవారికి అదుపులోకి వస్తుంది. జ్యుస్ తాగడానికి ఇబ్బందిగా ఉంటె అందులో నిమ్మరసం కలుపుకొంటె అనుకూలంగా ఉంటుంది. ఖనిజాలు, యాసిడ్స్, పోషకాలు, ఎంజైములు అధిక బరువును తగియించడానికి పనిచేస్తాయి.
రోగనిరోధక శక్తిని పెంచుతుంది. గుండె జబ్బు ఉన్నవారికి చాలా విధాలుగా ఉపయోగపడుతుంది. పొట్టలో పేరుకు పోయిన కొవ్వు క్రమంగా కరిగిపోతుంది. పేగుల్లో తయారైన చెడు అంతా మలం ద్వారా వెళ్ళిపోతుంది. నాడీ వ్యవస్థ సక్రమంగా పనిచేస్తుంది. వేసవిలో తాగితే శరీరం చల్ల బడుతుంది. చర్మంపై ఏర్పడిన గాయాలపై గుజ్జు పెట్టి కట్టు కడితే తొందరగా నయమవుతుంది. కాబట్టి ఇంటి ఆవరణలో కొద్దిపాటి స్థలం ఉన్నా ఇతర మొక్కలతో పాటు కలబంద మొక్కను సైతం పెంచుకొంటె వైద్యుడి మాదిరిగా పనిచేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. నిత్యం కలబంద జ్యుస్ తాగడం వలన మన శరీరానికి ఎంతో రక్షణగా ఉంటుందని కూడా ఆరోగ్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు.