Home బిజినెస్ Income Tax Alerts: Income Tax చెల్లించే వారికీ ముఖ్య గమనిక.. జూన్ 15 లోపు...

Income Tax Alerts: Income Tax చెల్లించే వారికీ ముఖ్య గమనిక.. జూన్ 15 లోపు మాత్రమే గడువు

Income Tax Alerts
Income Tax Alerts

Income Tax Alerts: పన్ను చెల్లింపుదారులకు ఒక కీలకమైన అప్డేట్. పన్ను చెల్లించడానికి జూన్ 15 వరకు మాత్రమే గడువు ఉందని సమాచారం. అయితే గడువు లోపల పన్ను చెల్లించకపోతే ఏం జరుగుతుందో తెలుసా. సకాలంలో పన్ను చెల్లించడం ప్రతి ఒక్కరి బాధ్యత. అయితే గడువులోగా కన్ను చెల్లించకపోతే కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. కొంతమందికి ప్రతి ఆర్థిక సంవత్సరంలో ముందస్తుగా పన్ను చెల్లించాల్సిన పరిస్థితి ఉంటుంది. అటువంటి వారికి జూన్ 15 వరకు మాత్రమే గడువు ఉంది. ముందస్తు పన్ను చెల్లించాల్సిన చాలామందికి ఇది ఆఖరి గడువు అని చెప్పొచ్చు.

జూన్ 15 లోపు మీరు ముందస్తు పన్ను చెల్లించకపోతే జరిమానాలు, వడ్డీల రూపంలో మీకు అదనపు భారం పడే అవకాశం ఉంది. ఏడాది మొత్తం మీరు సంపాదించిన ఆదాయానికి మీరు ముందుగానే చెల్లించే ఆదాయపు పన్నును ముందస్తు పన్ను అని అంటారు. మీరు దీనిని ఏడాది మగ్గించిన తర్వాత కాకుండా ముందుగానే కొన్ని తేదీలలో విడతలేరుగా మీరు దీనిని చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు సంపాదించిన ఆదాయానికి సరిపడిన పన్ను బాకీ 10,000 కంటే ఎక్కువ ఉన్నట్లయితే మీరు ముందస్తు పన్ను చెల్లించాలి. వ్యాపారం చేసే వాళ్లైనా లేదా వేతనదారులైన ఈ పన్ను చెల్లించాలి. జీతం కాకుండా ఇతర వాటి నుంచి ఆదాయం సంపాదించేవారు ఈ ముందస్తు పన్ను చెల్లించాలి.

అలాగే స్వయం ఉపాధి కలిగి ఆదాయం సంపాదించేవారు లేదా ఫ్రీ లాన్సర్లు ఏడాది లాభం అంచనా వేసి దాని ప్రకారం పన్ను చెల్లించాలి. తెచ్చాను 44 ఏడి కింద ఆదాయం పెరుగుతున్న వారు పన్ను లెక్కలు చూసుకుని ముందస్తు పన్ను చెల్లించాలి. వ్యాపారం ద్వారా ఆదాయం పొందే వారు కూడా ముందస్తు పన్ను చెల్లిస్తూ ఉండాలి. ముందస్తు పన్ను చెల్లించేవారు ఏడాదిలో నాలుగు విడతలుగా చెల్లించాలి. వాళ్లు జూన్ 15 లోపు పన్నులో 15% చెల్లించాలి. అలాగే సెప్టెంబర్ 15 లోపు మొత్తం పనులు 45% చెల్లించాల్సి ఉంటుంది. డిసెంబర్ 15లోగా వాళ్ళు మొత్తం పన్నులో 75% పన్ను చెల్లించి ఉండాలి. ఇక మార్చి 15 లోపు మొత్తం పన్ను 100% చెల్లించి ఉండాలి.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now