Business Idea: ఈ మధ్యకాలంలో చాలామంది సొంత ఊరిని వదిలి వేరే ఊర్లో ఉద్యోగం చేయలేక ఉన్న ఊర్లోనే సొంతంగా వ్యాపారం చేసుకునేందుకు ఆలోచిస్తున్నారు. చాలామంది తమ కుటుంబానికి ప్రతిరోజు కావాల్సిన నిలకడ ఆదాయం కోసం ఉన్న ఊర్లోనే ఆదాయ మార్గం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఇటువంటి వారికి ప్రస్తుతం మనం చెప్పబోయే బిజినెస్ చాలా మంచి బిజినెస్ అని చెప్పొచ్చు. ప్రతి ఒక్కరి జీవితం ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి టీతోనే మొదలవుతుంది.
చాలామంది టీ తాగకుండా రోజును మొదలుపెట్టలేరు. మరి కొంతమందికి ప్రతిరోజు నాలుగైదు సార్లు టీ తాగే అలవాటు ఉంటుంది. పనిలో ఒత్తిడి కారణంగా చాలామంది నాలుగైదు సార్లు టీ తాగుతూ ఉంటారు. ఇంటికి అతిధులు వచ్చిన సమయంలో కూడా వారికి టీ అందించడం మనకున్న ఆనవాయితీ. టీ కు ఉన్న డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ క్రమంలో వీటిని ఆధారంగా చేసుకుని చాలామంది వివిధ రకాల టీ స్టాల్స్ ని నడుపుతున్నారు. మన దేశంలో టీ ని ఒక సంస్కృతి మరియు అభిరుచి గా కూడా భావిస్తారు. ఉదయం అలాగే సాయంత్రం చాలామంది టీ తాగి ఒత్తిడి నుంచి ఉపశమనం పొందుతుంటారు.
అప్పటి కాలం నుంచి ఈ తరం వరకు కూడా టీ కు ఉన్న డిమాండ్ మాత్రం తగ్గడం లేదు అని చెప్పడంలో సందేహం లేదు. కాబట్టి మీరు దీనిని ఒక వ్యాపారంగా మార్చుకొని మంచి ఆదాయం పొందవచ్చు. ఏడాది పొడవునా మార్కెట్లో టికు బాగా డిమాండ్ ఉంటుంది. గ్రామాలలో అయినా సరే పట్టణాలలో అయినా సరే ఏ చోట అయినా టీ వ్యాపారానికి బాగా డిమాండ్ ఉంది. ఈ మధ్యకాలంలో చాలామంది టీ స్టాల్స్ ఏర్పాటు చేసుకుంటున్నారు. ఒక చిన్న బండిలో లేదా చిన్న టీ స్టాల్ తీసుకుని మీరు కేవలం రూ.5000 రూపాయలతో ఈ వ్యాపారాన్ని మొదలు పెట్టవచ్చు. దీంట్లో మీరు ప్రతి నెల మంచి ఆదాయం పొందవచ్చు.