Home విద్య/ఉద్యోగాలు Jobs Notification: నిరుద్యోగులకు ప్రభుత్వం శుభవార్త.. త్వరలో 5,368 ఉద్యోగాలకు నోటిఫికేషన్

Jobs Notification: నిరుద్యోగులకు ప్రభుత్వం శుభవార్త.. త్వరలో 5,368 ఉద్యోగాలకు నోటిఫికేషన్

Jobs Notification
Jobs Notification

Jobs Notification: నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి గుడ్ న్యూస్ తెలిపింది. నిరుద్యోగులకు టీఎస్పీఎస్సీ ద్వారా పలు ఉద్యోగాల పోస్టులకు భర్తీ చేయడానికి ప్రభుత్వం తాజాగా భారీ నోటిఫికేషన్ విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న విద్యుత్ పంపిణీ సంస్థల్లో 5,368 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పాలనలోకి వచ్చిన సమయం నుంచి చాలామంది నిరుద్యోగులకు ఉద్యోగాలు దొరుకుతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన పరీక్షలకు సంబంధించిన ఉద్యోగాల భర్తీ ప్రక్రియను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేసిన సంగతి తెలిసిందే.

అప్పట్లో రిలీజ్ అయిన నోటిఫికేషన్లు గ్రూప్1, గ్రూపు 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఉద్యోగాల భర్తీ కోసం వివిధ దేశాలలో సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న విద్యుత్ పంపిణీ సంస్థలలో ఖాళీగా ఉన్న ఉద్యోగుల పోస్టులను భర్తీ చేయడానికి త్వరలో ఒక భారీ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఇప్పటికే దీనికి సంబంధించి సంబంధిత శాఖలు చర్యలు చేపట్టాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంపీడీసీఎల్ లో 2,170, ఎస్పీడీసీఎల్ లో 2,005, అలాగే ట్రాన్స్కో లో 703, జెన్కోలో 490 ఉద్యోగాల ఖాళీలు ఉన్నట్లు ప్రభుత్వం నివేదిక జారీ చేసింది. దీంతో ఈ సంబంధిత పోస్టులకు త్వరలో నోటిఫికేషన్ జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఈ పోస్టులకు ఏదైనా డిగ్రీ, డిప్లమా, ఐటిఐ లేదా బీటెక్ జరిగిన విద్యార్థులు అర్హులు.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now