Todays Gold Rate: మనదేశంలో మహిళలు బంగారానికి ఎంత ప్రాముఖ్యత ఇస్తారో అందరికీ తెలిసిందే. దీనిని కేవలం ఒక ఆభరణంగా మాత్రమే కాదు ఒక మంచి పెట్టుబడి సాధనంగా కూడా మన దేశ ప్రజలు భావిస్తారు. పండుగలు, పెళ్లిలో ఇలా ఇంట్లో ఏ చిన్న శుభకార్యం అయినా కూడా ముందుగా మహిళలు బంగారం మరియు వెండి వస్తువులను కొనడానికి ఆసక్తి చూపిస్తారు. అయితే గత కొన్ని రోజుల నుంచి బంగారాన్ని మంచి పెట్టుబడిగా అందరూ భావిస్తున్నారు. ఈ క్రమంలో అంతర్జాతీయ మార్కెట్ తో పాటు మన దేశ మార్కెట్లో కూడా బంగారం ధరలకు రెక్కలు వచ్చాయి.
గత కొన్ని రోజుల నుంచి అంతర్జాతీయంగా జరుగుతున్న పరిస్థితుల కారణంగా కూడా మనదేశంలో బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. కేవలం గత నాలుగు రోజులలో రూ.3750 పెరిగిన బంగారం ధర ఈరోజు మాత్రం స్వల్పంగా తగ్గింది. హైదరాబాద్ నగరంలో ఈరోజు స్వచ్ఛమైన గోల్డ్ రేట్ తులం రూ.1,01,670, 22 క్యారెట్ల గోల్డ్ రేటు తులం రూ.93,190 గా ఉన్నాయి. దాదాపుగా ఇవే ధరలు తెలుగు రాష్ట్రాలలో పలు ప్రధాన నగరాలు అయినా విజయవాడ, విశాఖపట్నం, రాజమండ్రి, వరంగల్ మరియు ప్రొద్దుటూరులో కూడా ఉన్నాయి.
మన దేశ రాజధాని అయిన ఢిల్లీ మార్కెట్లో స్వచ్ఛమైన తులం గోల్డ్ రేటు ఈరోజు రూ.1,01,820, 22 క్యారెట్ల తులం గోల్డ్ రేటు రూ.93,340 గా ఉన్నాయి. ముంబై నగరంలో ఈరోజు స్వచ్ఛమైన తులం గోల్డ్ రేటు రూ.1,01,670, 22 క్యారెట్ల తులం గోల్డ్ రేటు రూ.93,190 గా ఉన్నాయి. ఇక ఈ ధరలు పలు ప్రధాన నగరాలు చెన్నై, కోల్కత్తా, ముంబై, కేరళ మరియు బెంగళూరు వంటి నగరాలలో కూడా ఉన్నాయని సమాచారం. మన దేశంలో ఉన్న వెండి ధరలు కూడా అంతర్జాతీయ మార్కెట్లో ఉన్న వెండి ధరలపై ఆధారపడి ఉంటాయి. డాలర్ తో రూపాయి మారకం విలువపై వెండి ధరలు ఆధారపడి ఉంటాయి. ఈరోజు వెండి కూడా మన దేశ మార్కెట్లో స్వల్పంగా తగ్గింది. ఈరోజు మనదేశంలో ఉన్న పలు ప్రధాన నగరాలలో కిలో వెండి ధర రూ.1,09,900 గా ఉంది.