Vastu Tips: కొన్ని రకాల మొక్కలు ఇంట్లో ఆర్థిక సమస్యలు అలాగే పనిలో అడ్డంకి లేకుండా చేస్తాయి. వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని రకాల మొక్కలను ఇంట్లో పెట్టుకుంటే ఆ ఇంట్లో ఆనందం మరియు శ్రేయస్సు కలుగుతుంది అని నిపుణులు సూచిస్తున్నారు. ఇంట్లో సానుకూల శక్తి పెరగడానికి ఈ మొక్కలు బాగా ఉపయోగపడతాయి. హిందూ మత శాస్త్రంలో తులసి మొక్కను చాలా పవిత్రమైన మొక్కగా అందరూ భావిస్తారు. ఈ మొక్కను లక్ష్మీదేవి రూపంగా కూడా పరిగణిస్తారు. చాలామంది ఇళ్లలో తులసి మొక్క ఉంటుంది. ఇంట్లో ఉత్తరం లేదా ఈశాన్య దిక్కులో తులసి మొక్కను పెంచడం చాలా శుభప్రదం అని వాస్తు శాస్త్ర నిపుణులు చెప్తున్నారు. మహావిష్ణువు మరియు లక్ష్మీదేవి తులసి మొక్కలో నివసిస్తారని చాలామంది నమ్మకం.
వెదురు మొక్కను కూడా చాలా పవిత్రమైన మొక్కగా అందరూ భావిస్తారు. వాస్తు శాస్త్ర ప్రకారం వెదురు మొక్క ఇంట్లో అదృష్టాన్ని తీసుకొని వస్తుంది. ఇంటికి ఆనందం, కీర్తి మరియు అదృష్టాన్ని కలిగిస్తుంది. ఈ మొక్కను బహుమతిగా కూడా ఇవ్వవచ్చు. ఈ మొక్క ఉన్న ఇంట్లో సంపద ఉంటుంది అని నమ్ముతారు. మనీ ప్లాంట్ మొక్క ఇంట్లో సంపాదన మరియు సానుకూల శక్తిని ఆకర్షిస్తుంది అని చాలామంది నమ్మకం. కుటుంబ ఆర్థిక భారాన్ని ఈ మొక్క తగ్గిస్తుంది అని విశ్వసిస్తారు. అయితే ఇంట్లో మనీ ప్లాంట్ మొక్కలు ఆగ్నేయం దిశలో పెంచుకోవాలి.
అలాగే ఈ మొక్కను బహుమతిగా ఎవరికి ఇవ్వకూడదు. ఇంట్లో జెడ్ ప్లాంట్ మొక్క పెరుగుదలను సూచిస్తుంది. స్నేహానికి మరియు అనుబంధానికి దీనిని చిహ్నం గా చెబుతారు. ఇంట్లో ఆర్థిక సమస్యలను కూడా ఇది పరిష్కరిస్తుంది. హిందూ మత శాస్త్రం ప్రకారం ఉసిరి చెట్టున దేవతల నివాసం గా కూడా భావిస్తారు. విష్ణుమూర్తికి ఉసిరి చెట్టు మరియు ఉసిరికాయలు అంటే చాలా ఇష్టం. ఇంట్లో ఉత్తరం లేదా తూర్పు దిశలో ఉసిరి చెట్టును పెంచడం చాలా శుభప్రదంగా భావిస్తారు.