Inverter Battery: ఇన్వర్టర్ వాడుతున్న వాళ్లు పొరపాటున కూడా ఈ తప్పులు చేయకండి.. ఎందుకో తెలుసా..!

Inverter Battery
Inverter Battery

Inverter Battery: ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరు ఇంట్లో కూడా ఇన్వర్టర్ ఉంటుంది. వేసవికాలంలో ముఖ్యంగా పవర్ బ్యాక్అప్ కోసం చాలామంది ఇన్వర్టర్ ను ఉపయోగిస్తున్నారు. కానీ కొన్ని జాగ్రత్తలను తీసుకోకపోతే భారీ నష్టం కూడా ఏర్పడవచ్చు. ఇన్వర్టర్ పెళ్లి గాయపడిన సందర్భాలు ఇప్పటివరకు చాలానే వార్తలలో వినిపించాయి. అయితే ఇన్వర్టర్ బ్యాటరీలకు సంబంధించి పేలుళ్లు చాలా అరుదుగా ఉన్నప్పటికీ కూడా వీటికి సంబంధించి సరైన జాగ్రత్తలు పాటించకపోతే మాత్రం అవి సంభవించే అవకాశం ఉంది. నిర్దేశించిన సమయానికి మించి ఇన్వర్టర్ బ్యాటరీని ఎప్పుడు చార్జ్ చేయకూడదు. ఇలా చేయడం చాలా ప్రమాదకరము. ఆ బ్యాటరీ తయారీదారు సూచించిన దాని ప్రకారం మాత్రమే మీరు చార్జింగ్ చేయాలి.

చార్జింగ్ చేయడానికి మంచి ఛార్జ్ కంట్రోలర్ ఉపయోగించాలి. ఒకవేళ మీ బ్యాటరీ వాట్ తో నడుస్తున్నట్లయితే ఎప్పటికప్పుడు ఆ బ్యాటరీ వాటర్ స్థాయిని తనిఖీ చేస్తూ ఉండాలి. వాటర్ స్థాయి తక్కువగా ఉన్నప్పుడు కూడా బ్యాటరీ ప్లేట్లు బహిర్గతం అయ్యే అవకాశం ఉంది. ఈ క్రమంలో బ్యాటరీ లోపల వేడి బాగా పెరిగి పేలుడు జరిగే ప్రమాదం ఉంది. ఇన్వర్టర్ ని అధిక వేడి లేదా ప్రత్యక్ష సూర్యకాంతి తగిలే విధంగా పెట్టకూడదు. అధిక ఉష్ణోగ్రతలు ఇన్వర్టర్ లోని బ్యాటరీని బాగా వేడెక్కేలాగా చేస్తాయి. ఇవి పేలుడుకు కూడా కారణం కావచ్చు.

బ్యాటరీ టెర్మినల్స్ పై తుప్పు లేదా ధూళినీ ఎల్లప్పుడు శుభ్రం చేస్తూ ఉండాలి. లేకపోతే షార్ట్ సర్క్యూట్ ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి టెర్మినల్స్ పై పెట్రోలియం జెల్లీ లేదా లూబ్రికెంట్స్ ఉపయోగించి శుభ్రం చేస్తూ ఉండాలి. వెంటిలేషన్ ఉన్న ప్రాంతంలో బ్యాటరీలను నిల్వ చేయాలి. బ్యాటరీ వాయువులో రిలీజ్ చేస్తే అది పేలుడు సంభవించే అవకాశం ఉంటుంది. కాబట్టి వెంటిలేషన్ ఉన్న ప్రాంతాలలో మాత్రమే బ్యాటరీలను ఏర్పాటు చేయాలి. తప్పుగా చెప్పిన వైరింగ్ కూడా బ్యాటరీ పేలుడుకు కారణం కావచ్చు. నాణ్యమైన కేబుల్ మాత్రమే బ్యాటరీ కి ఉపయోగించాలి.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now