Vastu Tips: ఇంట్లో మెట్ల కింద బాత్రూమ్ ఉంటే.. లాభమా లేక నష్టమా..వాస్తు ప్రకారం ఏం జరుగుతుందంటే

Vastu Tips
Vastu Tips

Vastu Tips: కొంతమంది ఇళ్లలో మెట్ల కింద బాత్రూం ఉంటుంది. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం మెట్ల కింద బాత్రూం ఉండడం ఆ ఇంటికి శుభమ లేదా అశుభమా అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. చాలామంది తమకున్న కొద్దిపాటి స్థలాన్ని సమర్థవంతంగా వినియోగించుకోవడానికి మెట్ల కింద బాత్రూమ్ నిర్మించుకుంటారు. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం ఇలా చేయడం వలన కొన్ని ప్రత్యేకమైన ఫలితాలు కలుగుతాయని నిపుణులు చెప్తున్నారు. ఇలా చేయడం వలన ఇంట్లో సానుకూల లేదా ప్రతికూల ప్రభావాలు కలుగుతాయో లేదో ఇప్పుడు తెలుసుకుందాం.

వాస్తు శాస్త్రం ప్రకారం మెట్ల కింద బాత్రూం నిర్మించడం అనేది కొన్ని సానుకూల అలాగే ప్రతి కులా ఫలితాలను కలిగిస్తుంది. ఇంట్లో శక్తి ప్రవాహాన్ని ఇది ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చిన్న స్థలం ఉండడం కారణంగా చాలామంది మెట్ల కింద బాత్ రూమ్ వచ్చేలాగా నిర్మించుకుంటారు. పట్టణ ప్రాంతాలలో లేదా కాంపాక్ట్ డిజైన్లలో ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పొచ్చు. బాత్రూం మెట్ల కింద ఉండడం వలన కొంచెం ప్రైవసీని కూడా కలిగిస్తుంది.

అయితే వాస్తు శాస్త్రం ప్రకారం మెట్ల కింద బాత్రూమ్ కొన్ని ప్రతికూల ప్రభావాలను కలిగిస్తుంది అని నిపుణులు చెప్తున్నారు. వాస్తు శాస్త్రం ప్రకారం మెట్లు చాలా బరువును సూచిస్తాయి అని చెప్తారు. కాబట్టి వాటి కింద బాత్రూం నిర్మించడం వలన ఆ ప్రాంతంలో ప్రతి కుల శక్తి కలుగుతుంది అని నమ్ముతారు. ఆ ఇంట్లో కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై లేదా మానసిక స్థితిపై ఇది ప్రభావం చూపించే అవకాశం ఉంది. అలాగే మెట్ల కింద బాత్రూం నిర్మించుకోవడం వలన ఆ ఇంట్లో ఆర్థిక సమస్యలు లేదా సంపద కోల్పోవడం అంటే సమస్యలు కూడా ఏర్పడవచ్చు. ధన ప్రవాహానికి కూడా ఇది ఆటంకం కలిగిస్తుంది అని నిపుణులు చెప్తున్నారు. కుటుంబ సభ్యుల మధ్య బంధాలపై కూడా ఇదే ప్రభావం చూపించవచ్చు.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now