Todays Gold Rate: భారీగా తగ్గిన పసిడి ధరలు.. బులియన్ మార్కెట్లో ఒక్కసారిగా పసిడి ధరలు పతనం

Todays Gold Rate
Todays Gold Rate

Todays Gold Rate: మహిళలకు బాగా ఇష్టమైన వస్తువులలో బంగారం కూడా ఒకటి. ఇంట్లో శుభకార్యాల సమయంలో మహిళలు ఎక్కువగా బంగారం కొనుగోలు చేస్తూ ఉంటారు. అయితే గత కొన్ని రోజుల నుంచి బంగారం ధరలలో భారీగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. మొన్నటి వరకు భారీగా పెరిగి లక్ష రూపాయలు దాటిన తులం బంగారం ధర మళ్ళీ తగ్గుముఖం పట్టింది. పండుగ లేదా పెళ్లిళ్లు వచ్చాయంటే చాలు మహిళలు ఎక్కువగా బంగారం కొనుగోలు చేస్తారు. కానీ ఈ మధ్యకాలంలో బంగారం ధర భారీగా హెచ్చుతగ్గులు కనిపిస్తున్న కారణంగా చాలామంది బంగారం కొనడానికి వెనకడుగు వేస్తున్నారు.

వరుసగా కొన్ని రోజులు పెరిగిన బంగారం ధరలు ఆ తర్వాత మరి కొన్ని రోజులు తగ్గుతూ కనిపిస్తున్నాయి. గత మూడు రోజుల నుంచి బంగారం ధరలలో తగ్గుదల పంపించింది. గడిచిన మూడు రోజుల నుంచి స్వచ్ఛమైన తులం గోల్డ్ ధరపై రూ.1320 తగ్గింది. అలాగే ఆర్నమెంట్ 22 క్యారెట్ల గోల్డ్ ధరపై రూ.1210 తగ్గింది. వెండి ధరలు మాత్రం పెరుగుతున్నాయి. గత రెండు రోజుల నుంచి కిలో వెండి ధరపై 200 రూపాయలు పెరిగింది.

తెలుగు రాష్ట్రాలలో పలు ముఖ్యమైన నగరాలు హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, వరంగల్ మరియు పొద్దుటూరు వంటి నగరాలలో ఈరోజు ఆర్నమెంట్ తులం బంగారం ధర రూ.91,990, స్వచ్ఛమైన తులం బంగారం ధర రూ.1,00,360 గా ఉన్నాయి. ఇక కిలో వెండి ధర ఈ ప్రాంతాలలో రూ.1,10,000 గా ఉంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో మాత్రం ఈరోజు కిలో వెండి ధర రూ.1,20,100 ఉన్నట్లు సమాచారం. ఇక దేశంలో పలు ముఖ్యమైన ప్రాంతాలు చెన్నై, బెంగళూరు, కోల్కత్తా మరియు ముంబై నగరాలలో ఈరోజు ఆర్నమెంట్ తులం గోల్డ్ ధర రూ.91,900, స్వచ్ఛమైన తులం గోల్డ్ ధర రూ.1,00,360 గా ఉన్నాయి. ఇక ఢిల్లీ నగరంలో మాత్రం ఈరోజు ఆర్నమెంట్ తులం గోల్డ్ ధర రూ.92,140, స్వచ్ఛమైన తులం గోల్డ్ ధర రూ.1,00,510 గా ఉంది.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now