Vastu Tips: ప్రతి ఒక్కరి ఇంటి ఆర్థిక స్థితితో గడియారం ముడిపడి ఉంటుంది అని వాస్తు శాస్త్రం చెప్తుంది. మీ గడియారం రంగు మరియు ఆకృతిని బట్టి కూడా దీనికి ప్రాముఖ్యత ఉంటుంది. అయితే ఇంట్లో గడియారాన్ని ఏ దిశలో పెట్టుకోవాలి అనే దాని గురించి కూడా వాస్తు శాస్త్రంలో చెప్పబడింది. ఇంట్లో ఉన్న ప్రతి వస్తువుకు వాస్తు శాస్త్రంలో కొన్ని నియమాలు ఉన్నాయి. కొన్ని రకాల వస్తువులను ఇంట్లో వాస్తు శాస్త్ర నియమాలను పాటించి సరైన దిశలో పెట్టుకోవాలి. లేకపోతే ఆర్థికపరంగా, ఆరోగ్యపరంగా అనేక ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది. అయితే ప్రతి ఒక్కరు ఇంట్లో అతిథులు కోసం గెస్ట్ రూమ్ ఏర్పాటు చేసుకుంటారు.
అయితే ఆ రూమ్లో గోడకు గడియారాన్ని కూడా పెడతారు. కానీ ఇప్పుడు మనం ఉన్న ఈ ఆధునిక యుగంలో ప్రతి ఒక్కరి దగ్గర ఫోన్ ఉండడం వలన సమయం తెలుసుకోవడం చాలా ఈజీగా మారిపోయింది. మరి కొంతమంది తమ చేతికి వాచ్ లను ధరిస్తారు. అయితే ప్రతి ఒక్కరి ఇంట్లో ఇప్పటికి కూడా గోడలకు గడియారం అనేది తప్పకుండా ఉంటుంది. గడియారం ఇంటి యొక్క ఆర్థిక స్థితితో ముడిపడి ఉంటుంది అని వాస్తు శాస్త్ర నిపుణులు చెప్తున్నారు. వాస్తు శాస్త్రంలో చెప్పిన దాని ప్రకారం ఇంట్లో గడియారం ఉత్తరం, తూర్పు లేదా పడమర దిశలలో పెట్టడం చాలా శుభప్రదంగా పరిగణిస్తారు.
పొరపాటున కూడా దక్షిణ దిశలో మాత్రం ఇంట్లో గడియారాన్ని వేలాడదీయకూడదు. దక్షిణ దిశలో గడియారాన్ని పెట్టడం వలన ఇంట్లో అనేక డబ్బు సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. గడియారాన్ని ఇంట్లో తూర్పు లేదా ఉత్తరం దిశలో పెట్టడానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వబడింది. గడియారం వేలాడ తీయడానికి పశ్చిమ దిశ కూడా సరైన దిశగా పరిగణిస్తారు. ముందుగా తూర్పు లేదా ఉత్తరం దిశలో గడియారం పెట్టడానికి వీలుగా లేకపోతే అప్పుడు మాత్రమే పశ్చిమ దిశలో పెట్టుకోవాలి.