Vastu Tips: ఈ 3 వస్తువులు బెడ్ రూమ్ లో ఉంటే.. చాలా ప్రమాదకరం.. వెంటనే ఇలా చేయండి

Vastu Tips
Vastu Tips

Vastu Tips: బెడ్ రూమ్ మానసిక ప్రశాంతతను కూడా కలిగిస్తుంది. కానీ ఇక్కడ పొరపాటు నాకు అన్ని వస్తువులను పెట్టడం వలన అది మీ నిద్రను పాడు చేయడమే కాకుండా మీ ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీస్తుంది. సాధారణంగా మీ పడక గదిలో ఉండే కొన్ని వస్తువులు కారణంగా మీరు ఊహించనంత ప్రమాదం జరిగే అవకాశం ఉంది. కొంతమంది పాత పడిపోయిన దిండ్లను వాడుతూనే ఉంటారు. కానీ ఇవి మీకు సమస్యలు తీసుకొచ్చే అవకాశం ఉంది. ఎక్కువ కాలం పెట్టిన దిండ్లలో దుమ్ము, ధూళి, చెమట వంటివి చేరడం వలన అవి మీకు చర్మ సమస్యలు, శ్వాసకోశ సమస్యలకు దారితీస్తాయి. మీకు మంచి నిద్రకు కూడా అవి ఆటంకం కలిగిస్తాయి.

కాబట్టి ప్రతి రెండేళ్లకు ఒకసారి దిండులను మారుస్తూ ఉండాలి. వాటికి ఉపయోగించే కవర్లను కూడా వారానికి ఒకసారైనా శుభ్రం చేయాలి. కొంతమంది బెడ్రూంలో ఎయిర్ ఫ్రెషర్స్ ను వాడుతారు. కానీ ఇవి ఆరోగ్యానికి మంచిది కాదు. వీటిలో ఉండే బెంజిన్ వంటి హానికరమైన రసాయనాలు ఆరోగ్య సమస్యలకు కారణమవుతాయి. చిన్నచిన్న పిల్లలు ఉన్న ఇంట్లో ఇవి చాలా ప్రమాదకరం. మంచి సువాసన కోసం మీరు లేవెండర్, లెమన్ లేదా పుదీనా ఎసెన్షియల్ వంటి ఆయిల్స్ ను డిప్యూజర్ లో పెట్టి వాడడం చాలా మంచిది అని చెప్పొచ్చు.

అలాగే బెడ్రూంలో ఉండే కిటికీలను తెరిచి ఉంచడం వలన స్వచ్ఛమైన గాలి లోపలికి వస్తుంది. ఎక్కువ కాలం నుంచి వాడుతున్న పరుపులలో కూడా సూక్ష్మ జీవులు, దుమ్ము, ధూళి వంటివి చేరతాయి. అవి దద్దుర్లు వంటి చర్మ సమస్యలకు అలాగే శ్వాస సంబంధిత సమస్యలకు కారణం అవుతాయి. పాత పరిపుల కారణంగా నడుము నొప్పి, మెడ నొప్పులు వంటివి కూడా కలగవచ్చు. కాబట్టి వైద్యుల సూచన మేరకు పరుపులను ప్రతి ఏడు లేదా 10 సంవత్సరాలకు ఒకసారి తప్పనిసరిగా మారుస్తూ ఉండాలి. ఆరు నెలలకు ఒకసారి పరిపులను తిప్పడం లేదా తడి ఆవిరి వంటివి లేకుండా చూసుకోవాలి. కాబట్టి బెడ్రూంలలో పాతబడిన వస్తువులను లేకుండా చూసుకోవాలి. అలాగే రసాయనాలు ఉన్న సువాసనలను కూడా వాడడం వలన ఆరోగ్య సమస్యలు కలుగుతాయి. బెడ్ రూమ్ లో గాలి బాగా వచ్చేలాగా కిటికీలను తెరిచి పెట్టుకోవాలి.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now