Tea Side Effects: ఉదయం నిద్రలేవగానే కొందరు టీ తాగుతారు. కొందరు బ్లాక్ టీ , మరికొందరు కాఫీ, ఇంకొందరు పాలు, లేదంటే వాటికి ఏదోఒక ఆహార పదార్థం కలుపుకొని తాగుతారు. కానీ ఆరోగ్య నిపుణులు మాత్రం టీ తాగితే బరువు పెరుగుతారని, టీ తాగే అలవాటును తగ్గించుకుంటే బరువు తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
కొందరు రోజుకు కనీసం మూడు నుంచి నాలుగు టీ లు తాగే అలవాటు ఉంటుంది. తద్వారా బరువు పెరగడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ అలవాటును కొద్దిగా తగ్గించుకుంటే బరువు తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతన్నారు.
పాలల్లో కొవ్వు ఉంటుంది. వాటికీ చక్కెర కలపడంతో ఒక కప్పు టీ కి 100 కేలరీలు శరీరంలో చేరుతాయి.
బరువు తగ్గడానికి చక్కర బదులు బెల్లం వాడుకోవాలి. తక్కువ కొవ్వు ఉన్న టోన్డ్ పాలను మాత్రమే తీసుకోవాలి. టీ ని రోజుకు రెండు సార్లు మాత్రమే తాగాలి. అది కూడా తక్కువ మోతాదులో తాగాలి. కనీసం ఎనిమిది గంటల వ్యవధి ఉండే విదంగా టీ తాగితే శరీరానికి మంచిది.
రోజుకు మూడు నుంచి నాలుగు సార్లు టీ తాగితే శరీరంలో నీటి శాతం తగ్గుతుంది. జీర్ణవ్యవస్థ బలహీనం అవుతుంది. ఆకలి తగ్గుతుంది.