Home బంగారం ధర Todays Gold Rate: పసిడి ప్రియులకు భారీ గుడ్ న్యూస్.. గడిచిన రెండు రోజులుగా తగ్గుతున్న...

Todays Gold Rate: పసిడి ప్రియులకు భారీ గుడ్ న్యూస్.. గడిచిన రెండు రోజులుగా తగ్గుతున్న పసిడి ధరలు

Todays Gold Rate
Todays Gold Rate

Todays Gold Rate: గత రెండు రోజుల నుంచి తగ్గిన బంగారం ధరలు ఈరోజు పెరిగినట్లు తెలుస్తున్నాయి. నిన్నటితో పోలిస్తే ఈరోజు తులం బంగారంపై స్వల్పంగా పెరుగుదల కనిపించింది. అంతర్జాతీయంగా జరుగుతున్న కొన్ని పరిణామాల కారణంగా మన దేశ మార్కెట్లో బంగారం ధరలలో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. అయితే గత రెండు మూడు రోజుల నుంచి బంగారం ధరలు తగ్గుతూ ఉండడంతో బంగారం కొనుగోలు చేయాలని చాలామంది భావిస్తున్నారు. కానీ ఈ క్రమంలో ప్రస్తుతం మళ్ళీ బంగారం ధరలు పెరిగాయి.

ఇరాన్ ఇజ్రాయిల్ మధ్య యుద్ధం, అంతర్జాతీయ అనిస్థితుల కారణంగా మన దేశం మార్కెట్లో బంగారం ధరలు పెరిగాయి. పెట్టుబడిదారులు బంగారాన్ని సురక్షితమైన పెట్టుబడి మార్గంగా భావిస్తున్న క్రమంలో బంగారం ధరలు పెరుగుతున్నాయి. ప్రస్తుతం మన దేశం మార్కెట్లో స్వచ్ఛమైన తులం బంగారం లక్ష రూపాయలు దాటింది. ఈరోజు తెలుగు రాష్ట్రాలలో ముఖ్యమైన నగరాలు అయినా హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, వరంగల్ లో గత రెండు రోజుల నుంచి స్వచ్ఛమైన తులం బంగారం ధరపై రూ.1300 రూపాయలు తగ్గింది.

ఈరోజు స్వచ్ఛమైన తులం గోల్డ్ ధర పై మళ్లీ రూ.540 రూపాయలు పెరిగింది. ఈ క్రమంలో ఈరోజు స్వచ్ఛమైన తులం బంగారం ధర రూ.1,00910 గా ఉంది. ఇక ఆర్నమెంట్ తులం గోల్డ్ ధర ఈరోజు రూ.92,500 గా ఉంది. బంగారంతోపాటు మన దేశ మార్కెట్లో వెండి ధరలు కూడా రోజురోజుకు పెరుగుతున్నాయి. ఈరోజు కిలో వెండి ధర మీద వెయ్యి రూపాయలు పెరిగింది. దీంతో తెలుగు రాష్ట్రాలలో ఉన్న హైదరాబాద్ నగరంతో సహా పలు ప్రధాన నగరాలలో కిలో వెండి ధర రూ.1,21,000 గా ఉంది.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now