Bank Account Tax Rules: ఆదాయపు పన్ను శాఖ వారు పన్ను ఎగవేత చేసిన వారికి అలాగే ఏమైనా ఇల్లీగల్ ఫైనాన్షియల్ యాక్టివిటీ వంటివి నివారించడానికి కీలక చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించింది. ఇటువంటి చర్యలను గుర్తించేందుకు ఆదాయపు పన్ను శాఖ వారు నిత్యం నగదు ట్రాన్సాక్షన్లను చెక్ చేస్తూ ఉంటారు. ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ వారు మన దేశంలో పన్ను ఎగవేత చేసిన వారికి అలాగే మనీ లాండరింగ్ లేదా ఇతర ఇల్లీగల్ ఫైనాన్షియల్ యాక్టివిటీస్ వంటివి పాల్పడిన వారికి కీలక చర్యలు తీసుకుంటుంది. ముఖ్యంగా ఆదాయపు పన్ను శాఖ వారు బ్యాంకు ఖాతాలలో చేసే డిపాజిట్లపై నిత్యం ఓ కన్నేసి ఉంచుతారు.
ఆదాయపు పన్ను శాఖ వారి నిబంధనల ప్రకారం మీరు ఒక ఆర్థిక సంవత్సరంలో మీ బ్యాంకు ఖాతాలో ఎటువంటి ట్యాక్సీ సమస్యలు లేకుండా 10 లక్షల రూపాయలు వరకు డిపాజిట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ బ్యాంకు ఖాతాలో పది లక్షల కు మించి నగదు ఉన్నట్లయితే బ్యాంకు అధికారులు ఆ వివరాలను ఆదాయపు పన్ను శాఖ వారికి రిపోర్ట్ చేస్తారు. ఆ తర్వాత ఆ డబ్బులు ఎక్కడ నుంచి వచ్చాయో వివరణ ఇవ్వాలంటూ ఆధారాలు చూపించాలి అంటూ ఆదాయపు పన్ను శాఖ వారు ఆ వ్యక్తికి నోటీసు పంపిస్తారు.
ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చాయో మీరు ఆధారాలు ఆదాయపు పన్ను శాఖ వారికి చూపించాల్సి ఉంటుంది. బ్యాంకు ఖాతాలలో నగదు డిపాజిట్ పై ఎటువంటి డైరెక్టు టాక్స్ లేదు కానీ ఎక్కువ మొత్తంలో బ్యాంకు ఖాతాలో డిపాజిట్ చేసినప్పుడు ఆ డబ్బులు ఎక్కడ నుంచి వచ్చాయో మీరు ఆధారాలతో నిరూపించాలి. లేకపోతే మీకు చట్టబద్ధమైన చర్యలు తప్పవు. ఇక వ్యాపారం చేసే వారికి ప్రొఫెషనల్స్ కి బ్యాంకు ఖాతాలలో డబ్బులు డిపాజిట్ చేసే లిమిట్ ఎక్కువగానే ఉంటుంది. అటువంటి వారికి ఒక ఆర్థిక సంవత్సరంలో 50 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్ చేసిన వారి వివరాలు బ్యాంక్ అధికారులు ఆదాయపు పన్ను శాఖ డిపార్ట్మెంట్ కు రిపోర్ట్ చేస్తారు. ఆయా బ్యాంకులను బట్టి కూడా పొదుపు ఖాతాలలో డబ్బులు డిపాజిట్ చేసే లిమిట్ ఆధారపడి ఉంటుంది.