Aadhaar Card: బ్లూ కలర్ ఆధార్ కార్డు గురించి తెలుసా.. ఇది కూడా చాలా ముఖ్యం..

Aaghaar Card
Aaghaar Card

Aadhaar Card: బ్లూ కలర్ ఆధార్ కార్డు గురించి తెలుసా.. ఇది కూడా చాలా ముఖ్యం..

 

ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డు చాలా ముఖ్యమైన పత్రం గా మారిపోయింది. గతంలో ప్రతి ఒక్కరూ కూడా ఆధార్ కార్డు తప్పనిసరిగా చేయించుకోవాలి. ఇది మన దేశ గుర్తింపు కార్డుగా పనిచేస్తుంది. పుట్టిన పిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు అందరికీ కూడా ఆధార్ కార్డు ముఖ్యంగా ఉండాలి. మన దేశ పౌరులు అని చెప్పడానికి ఇది ముఖ్యమైన గుర్తింపు కార్డుగా పనిచేస్తుంది. మనదేశంలో ఉన్న అనేక ప్రభుత్వ పథకాలు అలాగే ప్రయోజనాలు పొందాలంటే ఆధార్ కార్డు తప్పనిసరిగా ఉండాలి. ఈ క్రమంలో దేశంలో ఇప్పటివరకు ఆధార్ కార్డు పొందని వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు.

నీలి ఆధార్ కార్డు..

అయితే సాధారణ ఆధార్ కార్డుతో పాటు నీలి ఆధార్ కార్డు కూడా ఉంటుంది. నీలి ఆధార్ కార్డును కూడా పొందడం ప్రతి ఒక్కరికి చాలా అవసరం. ఐదేళ్ల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలకు ప్రభుత్వం నీలి ఆధార్ కార్డులను జారీ చేస్తుంది. ఈ నీలి ఆధార్ కార్డును బాల్ ఆధార్ కార్డు అని చెప్తారు. అయితే దీనిని చేయించడానికి బయోమెట్రిక్ అవసరం ఉండదు. పిల్లల పుట్టిన సమయంలో జలన ధ్రువీకరణ పత్రం అలాగే తల్లిదండ్రుల ఆధార్ కార్డును పెట్టి ఈ నీలిరంగు ఆధార్ కార్డును తయారు చేస్తారు.

12 అంకెల ప్రత్యేక సంఖ్య..

భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ ఈ బ్లూ కలర్ ఆధార్ కార్డును జారీ చేస్తుంది. దీనిలో కూడా 12 అంకెల ప్రత్యేక సంఖ్య ఉంటుంది. ఐదు ఏళ్ళు లేదా అంతకంటే తక్కువ వయసు ఉన్న పిల్లలకు ప్రభుత్వం ఈ నీలిరంగు ఆధార్ కార్డును జారీ చేస్తుంది. కానీ ఇది కేవలం 5 ఏళ్ల వరకు మాత్రమే చెల్లుతుంది. ఐదేళ్ల తర్వాత ఈ బ్లూ కలర్ ఆధార్ కార్డును అప్డేట్ చేసుకోవాలి. ఐదేళ్ల వయసు తర్వాత బ్లూ కలర్ ఆధార్ కార్డు పనిచేయదు. అయితే బ్లూ కలర్ ఆధార్ కార్డులో పిల్లల చిన్నప్పటి ఫోటో ఉంటుంది.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now