Aadhaar and PAN Card: ప్రభుత్వం న్యూ రూల్స్.. ఒక వ్యక్తి మరణించిన తర్వాత అతని ఆధార్ కార్డు, పాన్ కార్డ్ ఏం చేయాలంటే..
భారతీయ పౌరులకు తప్పనిసరిగా ఉండాల్సిన ముఖ్యమైన పత్రాలు ఆధార్ కార్డు మరియు పాన్ కార్డు. అయితే తాజాగా ప్రభుత్వం ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత అతనికి సంబంధించిన గుర్తింపు పత్రాలను దుర్వినియోగం చేయకుండా నివారించడానికి కొన్ని ముఖ్యమైన చర్యలను తీసుకుంది. ఒక వ్యక్తి మరణించిన తర్వాత అతని ఆధార్ కార్డు లేదా పాన్ కార్డును ఏం చేయాలో చాలామందికి తెలిసి ఉండదు. ఈ సునీతమైన సమస్యను నిర్వహించడానికి ప్రభుత్వం తాజాగా కొన్ని నియమాలను జారీ చేసింది. కొంతమంది మోసగాళ్లు మరణించిన వ్యక్తి యొక్క పాన్ కార్డు లేదా ఆధార్ కార్డు డి యాక్టివేట్ చేయని క్రమంలో అనధికార రుణాలు తీసుకోవడం, బ్యాంకులో ఖాతాలు తెరవడం లేదా అక్రమ లావాదేవీలకు పాల్పడడం వంటి మోసాలకు పాల్పడవచ్చు.
కాబట్టి ఒక వ్యక్తి మరణించిన తర్వాత అతనికి సంబంధించిన ఆధార్ కార్డు మరియు పాన్ కార్డు అంటే గుర్తింపు పత్రాలను వెంటనే రద్దు చేయాలి లేకపోతే సురక్షితంగా ఉంచుకోవాలి. ఈ పత్రాలను మీరు ఆన్లైన్ లేదా ఆఫ్లైన్లో కూడా చేసుకోవచ్చు. ముందుగా మీరు ఎన్ఎస్డిఎల్ వెబ్సైట్ని సందర్శించాలి. పాన్ కార్డు రద్దు చేయడం కోసం మీరు ఫారం 49 ఏ పంపాలి. అవసరమైన పత్రాలను సమర్పించి ఫారం సబ్మిట్ చేయాలి. మరణించిన వ్యక్తి ధ్రువీకరణ పత్రం అలాగే అతని పాన్ కార్డు, చట్టపరమైన వారసుడు సర్టిఫికెట్ వంటివి పెట్టాలి. కొన్ని రోజుల తర్వాత మరణించడం వ్యక్తి యొక్క పాన్ కార్డు డిఆక్టివేట్ అవుతుంది.
ఒకవేళ మీరు ఆఫ్లైన్లో పాన్ కార్డు రద్దు చేయాలి అనుకుంటే మీకు సమీపంలో ఉన్న ఆదాయ పనులు శాఖ కార్యాలయానికి వెళ్లి అక్కడ అవసరమైన పత్రాలను సమర్పించడం ద్వారా ఆఫ్లైన్లో పాన్ కార్డు రద్దు చేసుకోవచ్చు. అయితే యుఐడిఏఐ మాత్రం ఆధార్ కార్డును రద్దు చేసే సౌకర్యాన్ని ఇప్పటివరకు కల్పించలేదు. కానీ మీరు డిజిటల్ వ్యవస్థలలో మరణించిన వ్యక్తి యొక్క వేలిముద్రలను లాక్ చేయవచ్చు.