Vastu Tips For Money: ప్రతి ఒక్కరు కూడా తమ ఇంట్లో ఆనందం, ఐశ్వర్యం ఉండాలని కోరుకుంటారు. దీనికోసం మీరు కేవలం కష్టపడి సంపాదిస్తే సరిపోదు ఇంట్లో సానుకూల శక్తి ప్రవాహం కూడా ఉండాలి. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో సానుకూల శక్తి ఏర్పడి సంపాదన పెంచే కొన్ని నియమాలు ఉన్నాయి. ఈ నియమాలను మీరు పాటించడం వలన మీ ఇంట్లో ఆనందం, శ్రేయస్సు సంపద పెరుగుతాయి. మీరు కొన్ని అలవాట్లను అలవర్చుకుంటే మీ ఇంట్లో డబ్బుకు ఎటువంటి కొరత ఉండదు. వాస్తు శాస్త్రం ప్రకారం ప్రతిరోజు ఉదయం ఎనిమిది గంటలకంటే ముందు స్నానం చేయడం వలన ఆ ఇంట్లో సానుకూల శక్తి ప్రవహిస్తుంది.
ఆ రోజంతా కూడా మీ పని విజయవంతంగా ఉంటుంది. ధన ప్రవాహం పెరుగుతుంది. ఇంట్లో భార్య భర్తల మధ్య గొడవలు ఉన్నట్లయితే అది ప్రతికూల శక్తిని కలిగిస్తుంది. లక్ష్మీదేవి అటువంటి ఇంట్లో ఉండదు. కాబట్టి గొడవలు పడకుండా జాగ్రత్త పడాలి. వాస్తు శాస్త్రం ప్రకారం ఉదయం పూట పిల్లలు ఏడవడం మంచిది కాదని చెప్తున్నారు. ఇంట్లో ఉదయం పూట పిల్లలు ఏడవడం వలన ఆ ఇంట్లో శాంతి ఉండదు. డబ్బు ప్రవాహం కూడా తగ్గిపోతుంది.
మీరు మొదటి రోటీని ఆవుల కోసం తయారు చేయండి. ఇలా చేయడం వలన పుణ్యం ఏర్పడి ఆహార కొరత ఉండదు. వంటగదిలో ఉన్న నీటి కుండలో ఎల్లప్పుడూ నీరు నిండుగా ఉండేలాగా చూసుకోండి. ఆ ఇంట్లో సానుకూల శక్తి ఏర్పడి సంపద కూడా పెరుగుతుంది. వంటగదిలో మురికి పాత్రలను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోండి.ఎందుకంటే వంటింట్లో మురికి పాత్రలు ప్రతికూల శక్తిని సృష్టిస్తాయి. వీటి వలన డబ్బు ప్రవాహం తగ్గిపోతుంది. ఈ చిన్న చిన్న అలవాట్లను ప్రతిరోజు మీరు పాటించడం వలన మీ ఇంట్లో ఆనందం, శాంతి మరియు సంపద పెరుగుతాయి.