Muncipal Administration: ప్రజా శంఖారావం, వెబ్ డెస్క్: రాష్ట్రంలోని గ్రేటర్ హైదరాబాద్, మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీలలో బకాయి ఉన్న 2024-25 ఆర్థిక సంవత్సరం వరకు ఆస్తి పన్ను వడ్డీ బకాయిలలో 90% రాయితీ కల్పిస్తూ వన్ టైం సెటిల్మెంట్ (OTS)కు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ అధికారులు ఉత్తర్వులను జారీ చేశారు. ఈ లెక్కన అన్ని పట్టణ స్థానిక సంస్థలలో ఇప్పటివరకు బకాయి ఉన్న ఇంటి పన్ను పై 90 శాతం రాయితీతో చెల్లింపులు చేయవచ్చని ఈ ఉత్తర్వులో పేర్కొన్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరం వరకు బకాయి ఉన్న ఇంటి పన్ను వడ్డీ పై వన్ టైం సెటిల్మెంట్ చేసుకోవడానికి బకాయి ఉన్న యజమానుదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని స్థానిక కార్పొరేషన్, పట్టణ మున్సిపల్ అధికారులు ఒక ప్రకటన ద్వారా కోరారు.
ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group
Join Now