WhatsApp: ప్రస్తుతం ఉన్న డిజిటల్ యుగంలో హ్యాకర్లు యూజర్ల డేటాను దొంగలించడానికి అనేక కొత్త ప్లాన్లను వేస్తున్నారు. ముఖ్యంగా హ్యాకర్లు వాట్సాప్ లో సులభంగా హాక్ చేస్తున్నారు. మరి మీ వాట్సాప్ కూడా హ్యాక్ అయిందో లేదో ఇలా సులభంగా తెలుసుకోండి. హ్యాకర్లు ఎల్లప్పుడూ వాట్సాప్ కాల్స్, మెసేజ్, లింకులు, మాల్వేర్ ఫైల్స్ ద్వారా కస్టమర్లపై దాడి చేసేందుకు అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. మెటా యాజమాన్యం వాట్సాప్ ఎండ్ టు అండ్ ఎన్క్రిప్షన్ ద్వారా స్ట్రాంగ్ సెక్యూరిటీ ఇస్తున్నప్పటికీ యూజర్లను హ్యాకర్లు ఏదో ఒక విధంగా మోసం చేస్తున్నారు. ఒకవేళ మీ వాట్సాప్ కూడా హ్యాక్ అయి ఉంటే ఆ విషయాన్ని ఎలా తెలుసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
వాట్సాప్ అప్లికేషన్ అండ్ టు అండ్ ఎన్క్రిప్షన్ను వాడుతుంది. ఈ క్రమంలో సెండర్ మరియు రిసీవర్ మాత్రమే వాట్సాప్ మెసేజ్ లను చదవగలరు. వాట్సాప్ అదనంగా సేఫ్టీ కోసం టూ ఫ్యాక్టర్ అథెంటికేషను కూడా ప్రొవైడ్ చేస్తుంది. అలాగే అన్ వాంటెడ్ యూజర్లను బ్లాక్ చేయడానికి ప్రైవసీ కంట్రోల్ కూడా అందుబాటులోకి తెచ్చింది. ఆటోమేటిక్స్ పాన్ డిటెక్షన్ కూడా చేస్తుంది. అనుమానాస్పద యాక్టివిటీలు ఏమైనా జరిగితే సెక్యూరిటీ అలోడ్స్ కూడా పంపిస్తుంది. అయితే యూజర్లను హ్యాకర్లు సోషల్ ఇంజనీరింగ్ లేదా మాల్వేర్, స్పైవేర్ లేదా ఫార్వర్డ్ కాల్ అటాక్స్ వంటి పద్ధతులలో కూడా మోసం చేస్తున్నారు. మీ ఫోన్లకు తెలియని నెంబర్ల నుంచి మెసేజ్లు వస్తాయి.
ఆ మెసేజ్లను మీరు చదవకపోయినా కూడా మెసేజ్లను చదివినట్టు బ్లూ టిక్స్ కనిపిస్తాయి. మీ అకౌంట్ సెంటు ఫోల్డర్ లో మీరు పంపని మెసేజ్లు కూడా ఉంటాయి. కొత్తవి లేదా తెలియని నెంబర్లు మీ కాంటాక్ట్ లిస్టులో కనిపిస్తాయి. రాండంగా మీకు వెరిఫికేషన్ కోడ్స్ వస్తూ ఉంటాయి. వాట్సాప్ వెబ్ను ఉపయోగించే హ్యాకర్లు మీ అకౌంటును యాక్సిస్ చేయవచ్చు. వాట్సాప్ సెట్టింగ్స్ లో ఉన్న లింక్డ్ డివైసెస్ లోకి వెళ్లి లింక్ అయినా డివైస్లను చెక్ చేసుకోవచ్చు. అందులో మీకు ఏదైనా కొత్తవి లేదా తెలియని డివైస్ కనిపిస్తే వెంటనే లాగ్ అవుట్ చేయండి. మీ వాట్సాప్ అకౌంట్ నుంచి మీ స్నేహితులకు అనుమానస్పద మెసేజ్లు కూడా వెళ్లవచ్చు. మీ వాట్సాప్ అకౌంట్ ప్రొఫైల్ పిక్చర్, బయో లేదా పేరు మార్చినట్లు మీరు గమనిస్తే వెంటనే అలర్ట్ అవ్వాలి.