MLA Special prayers: జుక్కల్, మర్చి 12 (ప్రజా శంఖారావం): శ్రీ సోమేశ్వర ఆలయంలో జుక్కల్ నియోజకవర్గ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. బుధవారం కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం మద్నూర్ ఉమ్మడి మండలంలో నూతనంగా ఏర్పడ్డ డోంగ్లి మండల పరిధిలోని ఎనబోరా రాచన్న దేవాలయం నుండి కొలనుపాక శ్రీ సోమేశ్వర ఆలయానికి జుక్కల్ నియోజకవర్గం, పరిసర ప్రాంతాల నుండి భక్తులు పాదయాత్రగా వెళ్లడం జరిగింది.
జుక్కల్ ఎమ్మెల్యే వారితో కలిసి కొద్ది దూరం పాదయాత్రలో పాల్గొని సోమేశ్వర ఆలయాన్ని, రేణుకా చారిలను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.
ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group
Join Now