Todays Gold Rate: భారీగా తగ్గిన పసిడి, వెండి ధరలు.. ఈరోజు తులం ఎంతో తెలుసా..

Todays Gold Rate
Todays Gold Rate

Todays Gold Rate: భారీగా తగ్గిన పసిడి, వెండి ధరలు.. ఈరోజు తులం ఎంతో తెలుసా..

అంతర్జాతీయ మార్కెట్ ఆధారంగా మన దేశ మార్కెట్లో కూడా బంగారం ధరలలో మార్పులు జరుగుతూ ఉంటాయి. 90 రోజుల పార్టీ సుంకాలను తగ్గించడానికి అమెరికా మరియు చైనా మధ్య కుదిరిన ఒప్పందం అలాగే రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం వంటి వాణిజ్య యుద్ధం భయాలు బంగారం తగ్గడానికి ఒక కారణం అని చెప్పొచ్చు. అదేవిధంగా భారత్ మరియు పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గడం వలన కూడా ఎక్కువగా ఉన్న ఈక్విటీలకు ఇన్వెస్ట్ చేసే వారి సంఖ్య బాగానే పెరిగింది. ఈ క్రమంలో మార్కెట్లో బంగారం డిమాండ్ తగ్గిందని తెలుస్తుంది. గత వారం రోజులలో బంగారం ధర మూడు శాతం తగ్గినట్లు తెలుస్తోంది. మే 16, శుక్రవారం తెలుగు రాష్ట్రాలలో ఉన్న ప్రధాన నగరాలలో బంగారం ధరలు ఈ విధంగా ఉన్నాయి. ఈరోజు బంగారం ధర బులియన్ మార్కెట్లో 10 గ్రాములు 24 క్యారెట్లు రూ.93,920, 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాముల రూ.86,090 గా ఉన్నాయి.

ఇక హైదరాబాద్ మార్కెట్లో నేడు 10 గ్రాములు 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.86,090, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.93,920. తెలుగు రాష్ట్రాలలో పలు ప్రధాన నగరాలు అయిన వరంగల్, రాజమండ్రి, విశాఖపట్నం, విజయవాడ, నిజామాబాద్ మరియు పొద్దుటూరు వంటి ప్రాంతాలలో కూడా నేడు ఇవే ధరలు ఉన్నాయి.

ఇక చెన్నై మార్కెట్లో ఈరోజు 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.86,090, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.93,920.

ఇతర ప్రధాన నగరాలు ముంబై, కోల్కత్తా, బెంగళూరు, కేరళలో కూడా ఇవే ధరలు ఉన్నాయని సమాచారం.

దేశ రాజధాని ఢిల్లీ నగరంలో ఈరోజు 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.86,240, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.94,070.

గత నాలుగు రోజుల నుంచి వెండి ధరలో కూడా తగ్గుదల కనిపిస్తుంది. ఈరోజు కిలో వెండి పై వంద రూపాయలు తగ్గి రూ.1,07,900 గా ఉంది. పెట్టుబడి పెట్టాలని భావిస్తున్న వారు ఈ మధ్యకాలంలో సురక్షితమైన పెట్టుబడి అంటే బంగారము మరియు వెండి అని భావిస్తున్నారు. ఈ క్రమంలో వీటి ధరలు ఎన్నడూ లేని ఆల్ టైం రికార్డుకి చేరుకున్న కూడా మార్కెట్లో వీటి డిమాండ్ మాత్రం తగ్గడం లేదు.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now