Ghee Benefits: మన దేశ వంటకాలలో ఉపయోగించే ఒక అద్భుతమైన పదార్థం నెయ్యి. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న నెయ్యి సూపర్ ఫుడ్ గా పిలువబడుతుంది. ఆయుర్వేదంలో చెప్పిన దాని ప్రకారం ప్రతిరోజు ఉదయం ఖాళీ కడుపుతో నెయ్యి తీసుకోవడం వలన జీర్ణక్రియ వ్యవస్థ మెరుగుపడి రోగ నిరోధక శక్తి పెరగడం వంటి అనేక లాభాలు కలుగుతాయి. అయితే ఇది కొంతమందికి సరిపడకపోవచ్చు. ఎటువంటి వారు ఖాళీ కడుపుతో తీసుకోవడం వలన అనేక ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
ఖాళీ కడుపుతో ప్రతిరోజు నెయ్యి తీసుకుంటే జీర్ణ క్రియ మెరుగుపడుతుంది. దీనిలో ఉండే బ్యూటైరిక్ ఆమ్లం గట్ ఆరోగ్యాన్ని పెంపొందించడంలో సహాయపడుతుంది. ఆహారాన్ని సులభంగా జీర్ణం చేయడమే కాకుండా మలబద్ధకం వంటి సమస్యలను కూడా తగ్గించడంలో సహాయం చేస్తుంది. ప్రతిరోజు ఉదయం ఖాళీ కడుపుతో ఒక చెంచా నెయ్యి తీసుకోవడం వలన ఆ రోజంతా కూడా జీర్ణక్రియ బాగా జరుగుతుంది. నెయ్యిలో A,D,E,K విటమిన్లు అలాగే ఒమేగా త్రీ ఫ్యాటీ ఆమ్లాలు కూడా అధిక మొత్తంలో ఉంటాయి. రోగనిరోధక శక్తిని ఇవి బలంగా చేస్తాయి.
ప్రతిరోజు ఖాళీ కడుపుతో నెయ్యి తీసుకోవడం వలన శరీరం ఇన్ఫెక్షన్లతో పోరాడే సామర్థ్యం కూడా పెరుగుతుంది. సీజనల్ జబ్బులను నివారించడంలో అలాగే ఆరోగ్యాన్ని కాపాడడంలో నెయ్యి బాగా ఉపయోగపడుతుంది. నెయ్యిలో ఉండే ఆంటీ ఆక్సిడెంట్లు అలాగే ఆరోగ్యకరమైన కొవ్వులు, చర్మాన్ని డ్రైనేజ్ మరియు వృద్ధాప్య సంకేతాలను తగ్గిస్తాయి. చర్మానికి సహజమైన గ్లో వస్తుంది. జుట్టు ఆరోగ్యాన్ని కూడా ఇది మెరుగుపరుస్తుంది. కానీ కొంతమంది మాత్రం ఖాళీ కడుపుతో నెయ్యి తీసుకోవడం అంత మంచిది కాదు. అధిక కొలెస్ట్రాల్, గుండె జబ్బులు లేదా లాక్టోస్ ఇంటలెరెన్స్ వంటి ఉన్నవారు నెయ్యిని ఎక్కువగా తీసుకోకూడదు. మధుమేహం మరియు ఎక్కువ బరువు ఉన్న వాళ్లు కూడా నెయ్యిని పరిమితంగా మాత్రమే ఉపయోగించాలి. అలాగే కాలేయ సమస్యలతో బాధపడుతున్న వారు కూడా నెయ్యిని తీసుకోవడం వలన సమస్య మరింత పెరిగే అవకాశం ఉంది. కాబట్టి అలవాటు చేసుకునే ముందు వైద్యుల సలహా తీసుకోవడం మంచిది.