ATM: మే ఒకటి, 2025 నుంచి ఏటీఎంల నుంచి డబ్బులు డ్రా పై విధించే ఛార్జీలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పెంచడం జరిగింది. తాజాగా అమలులోకి వచ్చిన కొత్త నియమాల ప్రకారం ఏటీఎం నుంచి ఒక వ్యక్తి వారి ఉచిత లావాదేవీ పరిమితిని దాటిన తర్వాత అతను చేసే ప్రతి అదనపు లావాదేవీ పై కూడా గరిష్టంగా రూ.23 చార్జి విధిస్తారు. అయితే గతంలో పరిమితికి మించి లావాదేవీలు చేసినట్లయితే ఒక్కో లావాదేవీ కి చార్జీ రూ.21 విధించేవారు. మీరు మీ సొంత బ్యాంక్ బ్రాంచ్ ఏటీఎంలో నుంచి ప్రతి నెల 5 ఉచిత లావాదేవీలు అలాగే మెట్రో నగరాలలో ఇతర బ్యాంకుల ఏటీఎంలో నుంచి మీరు మూడు ఉచిత లావాదేవీలు చేసుకోవచ్చు.
అలాగే మీకు మెట్రో ఏకల నగరాలలో అయితే ఐదు ఉచిత లావాదేవీలు చేసుకోవచ్చు. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని బ్యాంకుల పొదుపు ఖాతాదారులకు ఈ నియమం వర్తిస్తుంది. బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉచిత పరిమితిలో ఎటువంటి మార్పులు చేయలేదు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా జారీ చేసిన నియమాలు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని వానిజయ బ్యాంకులకు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులకు, సహకార బ్యాంకులకు, అధికృత ఏటీఎం నెట్వర్క్ ఆపరేటర్లకు, కార్డు చెల్లింపు నెట్వర్క్ ఆపరేటర్లకు, వైట్ లేబుల్ ఎటిఎం ఆపరేటర్లకు వర్తిస్తుంది అని సూచించింది. ఉచిత లావాదేవీల తర్వాత కస్టమర్కు పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఎటిఎం లో 10 రూపాయల పన్ను విధించబడుతుంది.
అలాగే మెట్రో నగరాలలో ఇతర బ్యాంకుల ఎటిఎంలలో అయితే రూ.23 రూపాయలు ప్లస్ పన్ను ఇక మెట్రోయేతర నగరాలలో రూ.11 రూపాయలు ప్లస్ పన్ను వసూలు చేస్తారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ అధికార వెబ్సైట్లో ఇచ్చిన సమాచారం ప్రకారం ఈ బ్యాంకు కస్టమర్ ఇతర బ్యాంకుల ఏటీఎంలో ఉచిత లావా దేవి పరిమితి దాటినట్లయితే ప్రతి లావాదేవీ పై అదనంగా 23 రూపాయలతో పాటు ఆర్థిక ఇతర లావాదేవీలపై 11 రూపాయలు చార్జి విధిస్తారు. ఈ నియమాలు మే 9, 2025 నుంచి అమలులోకి వస్తాయి.