Coronavirus: వణికిస్తున్న కరోనా కొత్త వేరియంట్…తెలుగు రాష్ట్రాల్లో కూడా కేసులు నమోదు

Coronavirus
Coronavirus

Coronavirus: ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రజలందరిలో కరోనా కొత్త వేరియంట్ చాలా భయానకమా అనే ఆందోళన కలుగుతుంది. మళ్లీ పరిస్థితులు లాక్ డౌన్ కు దారితీస్తాయా అనే భయం కూడా అందరిలో నెలకొంది. ప్రస్తుతం అందరికీ గుర్తొచ్చేది కోవిడ్ బూస్టర్ వ్యాక్సిన్ అని చెప్పడంలో సందేహం లేదు. ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ బూస్టర్ వాక్సిన్ వేయించుకోవాలా వద్దా అనే సందేహం కూడా అందరిలో ఉంది. ఈ వ్యాక్సినేషన్ తో గుండెపోటు వచ్చే ప్రమాదం ఉందని అంటున్నారు. 2020 లో ప్రపంచ దేశాలన్నిటిని కుదిపేసిన మహమ్మారి కోవిడ్ 19 నేను ఇంకా ఉన్నాను అంటూ అప్పుడప్పుడు హెచ్చరిస్తూనే ఉంది.

ఆసియన్ కంట్రీస్ లో గత వారం రోజుల నుంచి కోవిడ్ 19 టెర్రర్ పుట్టిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ మధ్యకాలంలో మనదేశంలో కూడా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూ కోవిడ్ భయాన్ని అందరిలో కలిగిస్తున్నాయి. మనదేశంలో ప్రస్తుతం 250 కి పైగా పాజిటివ్ కేసులు ఉన్నాయని సమాచారం. తమిళనాడు, కేరళ మరియు మహారాష్ట్రలో ఈ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూ ఉంది. గతంలో మాదిరిగానే ఈసారి కూడా కేరళ రాష్ట్రం కోవిడ్ కేసులలో ముందుంది.

రీసెంట్గా కేరళ ఆరోగ్యం మంత్రి ఎలాంటి పరిస్థితికైనా రెడీగా ఉండాలి అని హెచ్చరించారు. అలాగే ఢిల్లీ, గుజరాత్, పాండిచ్చేరి, రాజస్థాన్, సిక్కిం, కర్ణాటక, హర్యానా, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాలు కూడా ప్రస్తుతం అటెన్షన్ మోడ్లో వచ్చాయి. కోవిడ్ మహమ్మారి తెలుగు రాష్ట్రాలని కూడా అలర్ట్ చేసింది. ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ ఇతర రాష్ట్రాలలో కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా స్పెషల్ అడ్వైజరి జారీ చేసింది. ప్రస్తుతం రైల్వే స్టేషన్లలో, బస్టాండ్లలో, ఎయిర్ పోర్ట్లలో ప్రతి ఒక్కరూ మాస్క్ వేసుకోవడం అలాగే భౌతిక దూరం పాటించడం ప్రభుత్వం తప్పనిసరి చేసింది. 60 ఏళ్ల వయసు పైబడిన వృద్ధులు మరియు గర్భవతులు ఇంటి నుంచి బయటకు రావద్దు అని తెలిపింది.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now