Post Office Rules: మనదేశంలో ఉన్న లక్షలాది మంది పోస్ట్ ఆఫీస్ లో ఖాతాలు తెరిచి అనేక రకాల పథకాలలో పెట్టుబడి పెట్టారు. కానీ ప్రతి ఒక్కరి జీవితం ఎప్పుడూ ఎలా ఉంటుందో ఎవరు చెప్పలేరు. అనుకోకుండా ఎలాంటి సంఘటన అయిన జరగొచ్చు. అటువంటి సమయంలో పోస్ట్ ఆఫీస్ లో ఉన్న ఖాతాదారుడు ఒకవేళ ఆకస్మాత్తుగా మరణించినట్లయితే అతని ఖాతాలో జమ చేసిన మొత్తం డబ్బును ఎలా విత్డ్రా చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. పోస్ట్ ఆఫీస్ లో ఖాతా దారుడు మరణించినప్పుడు అతని ఖాతాలో ఉన్న డబ్బును అతని నామిని లేదా చట్టపరమైన వారసుడు ఎవరైనా ఆ డబ్బును క్లైమ్ చేసుకోవచ్చు.
ముందుగానే నామిని నియమించబడ్డారా లేదా అనే దానిపై ఈ ప్రక్రియ మొత్తం ఆధారపడి ఉంటుంది. ఆ ఖాతాదారుడికి ముందుగానే నామిని ఉన్నట్లయితే ఈ ప్రక్రియ చాలా సులభంగా పూర్తి అవుతుంది. ఖాతాదారుడి డబ్బును నామిని ఈజీగా క్లైమా చేసుకోవచ్చు. ఒకవేళ నామిని లేకపోతే వీలునామా లేదా వారసత్వ ధ్రువీకరణ పత్రం ద్వారా ఖాతాదారుడి డబ్బును క్లెయిమ్ చేసుకోవచ్చు. ఒకవేళ నామినీ లేనట్లయితే ఆరు నెలల నిరీక్షణ పూర్తి అయిన తర్వాత అఫిడవిట్, పరిహారానికి సంబంధించిన పత్రాలు అలాగే వారసత్వ ధ్రువీకరణ పత్రం కూడా తప్పనిసరి అవుతాయి.
పోస్ట్ ఆఫీస్ అధికార వెబ్సైట్ నుంచి నామిని క్లైమ్ చేసుకోవచ్చు. పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ పథకం కోసం ఫారం ఎస్ బి 84, ఖాతాదారుడి మరణ ధ్రువీకరణ పత్రంతోపాటు, ఆ నామిని యొక్క ఆధార్ కార్డు, పాన్ కార్డు, అడ్రస్ ప్రూఫ్ మరియు లేటెస్ట్ ఫోటో సమర్పించాల్సి ఉంటుంది. ఒకవేళ ఖాతాదారుడు వీలునామా రాసిపెట్టినట్లయితే దాని ఆధారంగా కూడా డబ్బును క్లైమ్ చేసుకోవచ్చు. దీనికి మీకు క్లెయిమ్ ఫారం తో పాటు మరణ ధ్రువీకరణ పత్రం అసలు అలాగే జిరాక్స్ కాపీ, చట్టపరమైన ఆధారాలు, వారసత్వ ధ్రువీకరణ పత్రం, వీలునామా రుజువు తప్పనిసరిగా ఉండాలి.