SSC STUDENTS COURSES: పదవ తరగతి పూర్తి చేసిన విద్యార్థుల కోసం ఎన్నో కోర్సులు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. ఈ కోర్సులను ఎంపిక చేసుకొని మంచి కెరీర్ కు మార్గం సులభం చేసుకోవచ్చు. స్నేహితులు చెప్పారని లేదా ఇతరులు చెప్పారని ఏది పడితే ఆ కోర్సు ఎంపిక చేసుకోకూడదు. ఇటువంటి కోర్సులు మీకు సరైనవి కాకపోవచ్చు. భవిష్యత్తులో మీరు ఎంచుకున్న మార్గం మహోన్నతం కావాలంటే పదవ తరగతి తర్వాత ఏ కోర్సు ఎంపిక చేసుకోవాలో సరైన నిర్ణయం తీసుకోవాలి. మీ బలాలు మరియు బలహీనతను దృష్టిలో పెట్టుకొని మీరు కోర్సును ఎంచుకోవాలి. స్వీయ సమీక్ష అనేది చాలా కీలకం కానుంది.
మీ యొక్క సామర్థ్యం మరియు మీకు దేని మీద ఆసక్తి ఉందో అది కూడా పరిగణలోకి తీసుకోవడం మంచిది. మీకున్న బలహీనత ఏమిటో ముందుగా తెలుసుకొని పదవ తరగతి తర్వాత ఉన్న కోర్సుల జాబితాలో నుంచి వాటిని తొలగించండి. ఆ తర్వాత మిగిలిన కోర్సులలో మీ భవిష్యత్తుకు సరైన కోర్సును ఎంపిక చేసుకోండి. పదో తరగతి తర్వాత అన్ని కోర్సులు వాటికి సంబంధించిన కెరియర్ గురించి బాగా అవగాహన పెంచుకోండి.
పదవ తరగతి పాసైన విద్యార్థులకు పాలిటెక్నిక్, ఒకేషనల్, ఇంటర్, ఐటిఐ కోర్సులు, ప్రత్యేక డిప్లమాలు, ఉద్యోగాలు వంటి ఆప్షన్లు ఉన్నాయి. మీకు సరైన కోర్సు ఏదో ఎంచుకోవడం మీ బాధ్యత. బాగా ఆలోచించి అలాగే విశ్లేషకుల నిర్ణయం కూడా తీసుకొని సరైన కోర్సును ఎంచుకోవాలి. మీకు ఒకవేళ గణితం అంటే భయం ఉంటే బైపిసి లేదా సైన్స్ పై ఆసక్తి లేకపోతే సీఈసీ వంటివి ఎంచుకుంటే భవిష్యత్తులో రాణించలేరు. మీరు బైపీసీ ఎంచుకోవడానికి గణితం రాకపోవడం కారణం కాకూడదు. సైన్స్ లో మీకు పట్టు లేకపోతే ఆర్ట్స్ కోర్సులో చేరడం వంటిది కూడా చేయకూడదు. మీకు ఇందులో బాగా ప్రావీణ్యం ఉందా ఆ దిశగా వెళ్లాలి.