Ration Card: రేషన్ కార్డు ఉన్నవారికి బంపర్ ఆఫర్…3 నెలల రేషన్ ఒకేసారి ఇస్తున్న ప్రభుత్వం

Ration Card
Ration Card

Ration Card: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డు ఉన్న పేదలకు ఏకంగా మూడు నెలల రేషన్ సరఫరా చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఈ ప్రక్రియ జూన్ నెల ఒకటవ తేదీ నుంచి మొదలవుతుంది. దీనికోసం ఈపాస్ మరియు బయోమెట్రిక్ విధానాలు కూడా అమలు చేయబోతున్నారు. రేవంత్ రెడ్డి నేతృత్వంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరోసారి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రజల సంక్షేమంపై పూర్తి దృష్టి పెట్టినట్టు తెలుస్తుంది. ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జూన్ ఒకటవ తేదీ నుంచి రేషన్ కార్డు ఉన్న వినియోగదారులకు ముందస్తు మూడు నెలల రేషన్ సరుకులను సరఫరా చేయనున్నట్లు ప్రకటించారు.

తెలంగాణ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ తాజాగా జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం రేషన్ కార్డు ఉన్నవారికి, జూలై మరియు ఆగస్టు నెలల రేషన్ సరుకులను ముందుగానే అందించే లాగా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ప్రకారం రేషన్ కార్డు ఉన్నవాళ్లు మూడు నెలల మొత్తం రేషన్ ఒకేసారి పొందవచ్చు. ప్రభుత్వం వర్షాలు మరియు వరదల కారణంగా రాష్ట్రంలో ప్రజలకు రేషన్ పొందడంలో ఆటంకం కలగకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. మూడు నెలల రేషన్ సరుకులు ఒకేసారి అందించేందుకు ఈపాస్, బయోమెట్రిక్ విధానాన్ని అనుసరించనున్నారు.

దీనికి సంబంధించి ఈపీఎఫ్ ప్రసీదులను జనరేట్ చేయాలని అలాగే వేరువేరుగా బయోమెట్రిక్ ధ్రువీకరణ కూడా చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. ఈ ప్రక్రియ అర్హులైన వారికి రేషన్ అందడంతో పాటు అక్రమాలు జరగకుండా చెక్ పెట్టేలా ఉంటుంది. ఈ మేరకు శనివారం రోజు తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్ డిఎస్ చౌహాన్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వం జూన్ 1వ తేదీ నుంచి జూన్ 30వ తేదీ వరకు మూడు నెలల పూర్తి రేషన్ సరుకులను ఒకేసారి పంపిణీ చేయాలనీ లక్ష్యంగా పెట్టుకుంది.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now