Aadhaar Card: ఆధార్ కార్డు పోగొట్టుకున్నారా.. డోంట్ వర్రీ.. ఈజీగా ఇలా పొందండి

Aadhaar Card
Aadhaar Card

Aadhaar Card: ఆధార్ కార్డు పొరపాటున పోయినా లేదా పాడైపోయినా కూడా మీరు సులభంగా ఇంటి దగ్గర నుంచే ఈ విధంగా డూప్లికేట్ ఆధార్ కార్డును పొందవచ్చు. UIDAI అధికార వెబ్సైట్లో మీరు హెల్ప్ లైన్ కు ఫోన్ చేయడం ద్వారా లేదా మీకు సమీపంలో ఉన్న ఆధార నమోదు కేంద్రం సందర్శించడం ద్వారా కూడా ఆన్లైన్లో మీరు డూప్లికేట్ ఆధార్ కార్డు అప్లై చేసుకోవచ్చు. స్టెప్ బై స్టెప్ వివరాలను పూర్తి చేసి మీరు డూప్లికేట్ ఆధార్ కార్డు అప్లై చేసుకోవచ్చు. మీ దగ్గర ఉన్న అసలు ఆధార్ కార్డు పోయినా లేదా దెబ్బ తిన్న మీరు నకిలీ ఆధార్ కార్డును సులభంగా పొందవచ్చు. మీరు ఆన్ లైన్లో లేదా ఆఫ్ లైన్ లో డూప్లికేట్ ఆధార్ కార్డు పొందవచ్చు.

ఆధార నమోదు కేంద్రాన్ని సందర్శించి కూడా మీరు డూప్లికేట్ ఆధార్ కార్డు అప్లై చేసుకోవచ్చు. మీకు సమీపంలో ఉన్న ఆధార్ నమోదు కేంద్రానికి వెళ్లి మీ పేరు, లింగం, జిల్లా పేరు లేదా పిన్ కోడ్ వంటి పూర్తి వివరాలను అందించాలి. ఆ తర్వాత మీ వేలిముద్ర, ఐరిసి స్కాన్ వంటివి నిర్వహిస్తారు. వివరాలన్నీ సరిపోలేన తర్వాత మీ ఆధార్ లేఖను ఆపరేటర్ ప్రింట్ చేసి ఇస్తారు. ఈ ప్రక్రియకు మీరు 30 రూపాయలు రుసుము చెల్లించాల్సి ఉంటుంది.

డూప్లికేట్ ఆధార్ కార్డు కోసం 1947 నెంబర్ కు కాల్ చేసి ఎగ్జిక్యూటివ్ తో మాట్లాడవచ్చు. మీరు అందించిన వివరాలు సరిపోలేనట్లయితే డూప్లికేట్ ఆధార్ కార్డును మీకు అందిస్తారు. మరొకసారి 1947 నెంబర్కు కాల్ చేసి ఐ వి ఆర్ ఎస్ ప్రక్రియను ఉపయోగించండి. అభ్యర్థి స్థితి ఎంపికైన ఎంచుకున్న తర్వాత పుట్టిన తేదీ పిన్కోడ్ నమోదు చేయాలి. మీరు ఇచ్చిన పూర్తి వివరాలు సరిపోలేనట్లయితే మీ ఆధార్ నెంబరు ఎగ్జిక్యూటివ్ మీకు ఇస్తారు.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now