Chanakya Niti: ఆచార్య చానిక్యుడు గొప్ప పండితుడు అన్న సంగతి అందరికీ తెలిసిందే. ఆయన తన నీతి శాస్త్రంలో మానవ వాలికి మేలు చేసే అనేక విషయాల గురించి తెలియజేశారు. ముఖ్యంగా ఆచార్య చాణిక్యుడు తన నీతి శాస్త్రంలో వైవాహిక జీవితం అలాగే భార్యాభర్తలకు సంబంధించిన అనేక విషయాల గురించి ప్రస్తావించారు. నీతి శాస్త్రంలో ఆయన భార్యకు భర్త చెప్పకూడని విషయాల గురించి కూడా తెలియజేశారు. ఒక భర్త తన ఆదాయానికి సంబంధించిన పూర్తి వివరాల గురించి అలాగే తాను చేసే పెట్టుబడి వివరాల గురించి భార్యకు చెప్పకూడదంట.
అవి కొన్ని కొన్ని సార్లు అనవసర ఖర్చులతో దారి తీసే అవకాశం ఉంది. అలాగే తన బలహీనతల గురించి భర్త భార్యతో ఎప్పుడు పంచుకోకూడదు. ఇలా చేయడం వలన నీపై ఉన్న నమ్మకం భార్యకు పోతుంది. అలాగే నీ మీద ప్రేమ తగ్గే అవకాశం కూడా ఉంది. అలాగే నీతి శాస్త్రంలో ఆచార్య చాణిక్యుడు చెప్పిన దాని ప్రకారం తనకు జరిగిన అవమానకర విషయాల గురించి భర్త తన భార్యతో చెప్పకూడదు. దీనివలన భార్య భర్తల మధ్య గొడవలు మొదలయ్యే అవకాశం ఉంది.
భార్యాభర్తలు తమకు సంబంధించిన చాలా విషయాలు ఒకరికొకరు పంచుకుంటారు. కానీ భర్త తన గతంలో ఉన్న ప్రేమ లేదా వ్యక్తిగత సంబంధ విషయాల గురించి భార్యతో అసలు చెప్పకూడదు. కుటుంబ సభ్యులకు సంబంధించిన లేదా స్నేహితులకు సంబంధించిన వ్యక్తిగత విషయాల గురించి కూడా భర్త భార్యకు చెప్పకూడదు. ఈ విషయాలు మీ బంధాన్ని కూడా ప్రభావితం చేసే అవకాశం ఉంది. అలాగే ఆచార్య చాణిక్యుడు తను పొదుపు చేసే డబ్బు గురించి రహస్య ప్రణాళికల గురించి భర్త భార్యకు చెప్పకపోవడం మంచిది అని తెలిపారు.