Todays Gold Rate: ప్రతిరోజు అంతర్జాతీయంగా జరిగే పరిణామాల కారణంగా బులియన్ మార్కెట్లో పసిడి మరియు సిల్వర్ ధరలలో మార్పులు జరుగుతూ ఉంటాయి. భౌగోళిక అనిశ్చితులు, యుద్ధ భయాలు కూడా బంగారం పెరుగుదలకు కారణం కావచ్చు. గత కొన్ని రోజుల నుంచి బంగారం ధరలు పెరుగుతూ ఆల్టైమ్ రికార్డ్ తులం లక్షకు చేరుకున్న సంగతి తెలిసిందే. అయితే మళ్లీ గత కొన్ని రోజుల నుంచి బంగారం ధరలో తగ్గుదల కూడా కనిపిస్తుంది.
మే 22, గురువారం తెలుగు రాష్ట్రాలలో నీ ప్రధాన నగరాలలో బంగారం ధరలు ఈ విధంగా ఉన్నాయి. హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు రూ.97,010, 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాముల రూ.90,100. ఇక విజయవాడ నగరంలో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాముల రూ.98,930, అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.89,300.
ఇక విశాఖపట్నం మార్కెట్లో ఈరోజు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రేటు రూ.95,830, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రేటు రూ.87,844. రాజమండ్రి నగరంలో నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రేటు రూ.98,930, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రేటు రూ.91,980. ఇక పొద్దుటూరు నగరంలో ఈరోజు 24 క్యారెట్ల బంగారం రేటు రూ.96,450, 22 క్యారెట్ల బంగారం రేటు రు.88,730.