Telangana: మధ్యతరగతి కుటుంబంలో చాలామంది భార్య భర్తలు ఒకరికొకరు తమ ఆర్థిక విషయాల గురించి చెప్పుకోరు. కొంతమంది భర్తలు తమ ఆర్థిక లావాదేవీల విషయాల గురించి భార్యకు తెలియకుండా ఉంటారు. తమ దగ్గర డబ్బులు ఉన్నాయని భార్యలకు తెలిస్తే వాళ్లు అనవసర ఖర్చులు చేస్తారని భావించి కొంతమంది భర్తలు ఆర్థిక విషయాల గురించి భార్యల దగ్గర ప్రస్తావించారు. ఈ క్రమంలో వాళ్లు భవిష్యత్తులో ఏవైనా ఆర్థిక ఇబ్బందులు వస్తే వాటిని అధిగమించడానికి డబ్బును దాచుకోవాలని భావిస్తారు.
తమ దగ్గర డబ్బులు ఉన్నట్లు ఇంట్లో వాళ్లకు తెలియకుండా వాళ్లు దాచుకుంటారు. అయితే ఒక భర్త తన భార్యకు తెలియకుండా ధాన్యం బస్తాలో డబ్బును దాచాడు. ఈ విషయం తెలియని భార్య తన ఇంట్లో అవసరాల కోసం దానం వస్తాను అమ్మింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. పోతరాజు వీరయ్య అనే వ్యక్తి వ్యవసాయం చేస్తూ ఉంటాడు. కొన్ని రోజుల క్రితం కుటుంబ ఖర్చులకోసం రెండు ఎద్దులను అమ్మేశాడు. ఆ సమయంలో అతనికి 1.50 లక్షలు వచ్చాయి. ఆ మొత్తం డబ్బును వీరయ్య తన ఇంట్లో ఉన్న ధాన్యం బస్తాలో దాచాడు.
కానీ ఈ విషయం ఆయన భార్యకు చెప్పలేదు. ఒకరోజు తన భర్త వీరయ్య పొలానికి వెళ్ళిన సమయంలో గ్రామంలో విడు ధాన్యం కొనుగోలు చేసే వ్యక్తి ఇంటికి వచ్చాడు. తన ఇంట్లో అవసరాల కోసం భార్య ఆ ధాన్యం వస్తాను అవి ఎత్తికి అమ్మేసింది. పొలం నుంచి తిరిగి వచ్చిన భర్త కు ఇంట్లో ఉన్న ధాన్యం బస్తా కనిపించకపోవడంతో చాలా టెన్షన్ పడ్డాడు. భార్యను అడిగితే ఆమె అవసరం కోసం ఆ ధ్యానం వస్తాను ఒక వ్యాపారి వస్తే అతనికి అమ్మినట్లు తెలిపింది. ఆ వ్యాపారి కోసం గ్రామం మొత్తం వెతికిన భర్త చివరకు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ వ్యక్తి కోసం గాలింపు చర్యలు చేస్తున్నారు.